ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్యాణం..కమనీయం!

ABN, First Publish Date - 2022-05-16T05:43:27+05:30

కల్యాణం..కమనీయం!

కల్యాణ ఘడియలో శ్రీవారు, అమ్మవార్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్యాణతంతు ఇలా!
పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిగిన ఈ కల్యాణ తంతులో ఆలయ అర్చకులు ముందుగా శాంతి హోమాన్ని జరిపి సర్వ దేవ తారాధన, సంకల్పం, కంకణపూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ రాజా ఎస్‌వీ సుధాకరరావు దేవస్థానం తరఫున కల్యాణమూర్తులకు పట్టువస్త్రాలను అందజేశారు. ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే తలారి వెంక ట్రావు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు అందించారు. ఆ తరువాత అర్చ కులు మూర్తులకు మధుపర్కాలను సమర్పించారు. సుముహూర్త సమ యంలో జీలకర్ర, బెల్లం ధరింపజేసి భక్తుల గోవిందనామ స్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాలు వైభవోపేతంగా జరిపించారు. ఆలయ ఈఓ త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించగా, ఈఈ భాస్కర్‌,  ఎంపీపీ బొండాడ మోహినీ వెంకన్నబాబు పాల్గొన్నారు. శ్రీహరి కళాతోరణ వేదికపై బాలలు చిన వెంకన్నపై ఆలపించిన భక్తిగీతాలు శ్రోతలను అలరించాయి.



వైభవంగా చినతిరుమలేశుని కల్యాణం
ద్వారకాతిరుమల, మే 15: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సింహ వాహనంపై ఉభయ దేవేరులతో రాజసంగా.. ఆసీనులైన స్వామివారు అట్టహాసంగా గజసేవల నడుమ క్షేత్రపురవీధుల్లో ఊరేగారు. రాత్రి తొళక్కవాహనంపై శ్రీవారు, అమ్మవార్లను ఉంచి అలంకరించి  ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటుచేసిన వేదిక దగ్గరకు తెచ్చారు. అంతకు ముందే వేదికను పచ్చిపూలతో, కళా సౌందర్యాలతో నయనానందకరంగా అలంకరించారు. వేదికపై ఉంచిన బంగారు సిం హాసనంపై కల్యాణమూర్తులను ఉంచి, అలంకరించి అర్చకులు కల్యాణతంతును ప్రారంభించారు. కల్యాణ ఘడియలో ఆదివారం చినతిరుమలేశుని దివ్యమంగళ స్వరూపాన్ని చూచిన భక్తులు తరిం చారు. ఆ దేవదేవుని కల్యాణ ఘట్టం.. కమనీయంగా ఆవిష్కృతమైన వేళ భక్తులు గోవిందా..గోవిందా అంటూ భక్తి పారవశ్యంలో మునిగారు.     

Updated Date - 2022-05-16T05:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising