ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ ఎస్‌ఐ అరెస్టు

ABN, First Publish Date - 2022-05-26T06:02:06+05:30

నకిలీ ఎస్‌ఐ అరెస్టు

పోలీసుల అదుపులో పవన తిరుమలేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, మే 25: ఇంటర్‌ చది వా డు. అనేక దొంగతనాల కేసుల్లో జైలుకెళ్లి బె యిల్‌పై తిరిగి వచ్చాడు. కొత్త తరహా నేరం చేయాలని ఈసారి ఏకంగా రైల్వే ఎస్‌ఐ అవతారమెత్తాడు. రైలులో టికెట్‌ లేని ప్రయాణికులను బెదిరించి వారి నుంచి డబ్బులు కాజేయడానికి ప్రయత్నిస్తుండగా గమనించిన రైల్వే బీట్‌ కానిస్టేబుల్‌ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే అప్రమత్తమై వారు అదుపులో తీసుకుని విచారించారు. నకిలీ ఎస్‌ఐగా నిర్ధారించి, అరెస్ట్‌ చేశారు. ఏలూరు రైల్వే ఎస్‌ఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరు సంగడి గుంట 6వలైన్‌కు చెందిన చాగంటి పవన తిరుమలేష్‌(25) విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పలు మోటారు సైకిళ్లు, ఇళ్లలో దొంగతనాల కేసుల్లో ఉన్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చాడు. మంగళవారం రాత్రి గుంటూరు నుంచి రాయగఢ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో ఎస్‌ఐ యూనిఫాం వేసుకుని ఎక్కాడు. ప్రయాణికులను టికెట్లు చూపించాలని అడుగుతూ.. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నిస్తుండగా.. ఏలూరు రైల్వే స్టేషన్‌లో బీట్‌ కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ అతనిని గమనించాడు. వెంటనే రైల్వే ఎస్‌ఐ వెంకటరమణకు సమాచారమిచ్చాడు. యూనిఫామ్‌లో ఉన్న పవన తిరుమలేష్‌ను విచా రించారు. ఎస్‌ఐ యూనిఫాం కొనుగోలు చేసి ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లుగా అంగీకరించాడు. దీంతో బుధ వారం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-26T06:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising