ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మ ధర పతనం

ABN, First Publish Date - 2022-05-27T05:39:39+05:30

నిమ్మకాయలు లేనప్పుడు ధరలు ఉన్నాయి. కాయలు ఉన్న ప్పుడు ధరలు లేవు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బస్తా రూ.5 వేలు నుంచి 

రూ.1000కు పడిపోయిన వైనం

రైతుల లబోదిబో

ఏలూరు రూరల్‌, మే 26 : నిమ్మకాయలు లేనప్పుడు ధరలు ఉన్నాయి. కాయలు ఉన్న ప్పుడు ధరలు లేవు. గత నెలలో బస్తా ఐదు వేల నుంచి ఆరు వేలకు పలకగా ప్రస్తుతం దిగుబడి ఎక్కువగా ఉండి నిమ్మధరలు ఆమాంతంగా బస్తా రూ.1000కి పడిపోయా యి. ధరలు ఉన్నపళంగా పడిపోవడంతో రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నిమ్మకాయల మార్కెట్‌ నుంచి కర్ణాటక, ము ంబై తదితర రాష్ట్రాలకు ముమ్మరంగా వ్యాపా రులు ఇక్కడి నుంచే ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం దిగుబడి ఎక్కువగా ఉండడంతో ఏలూరు మార్కెట్‌ యార్డుకు రోజుకు 30 నుం చి 40 లారీల బస్తాలు వస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు నిమ్మతోటలు సాగు చేస్తున్నారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్ళపాటు దిగుబడి ఉన్నా ఎగుమతులు లేక నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం దిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్లో నిమ్మకాయల ధరలు తగ్గిపోయాయి. గ్రేడ్‌ –1 నిమ్మకాయలు బస్తా గత నెలలో రూ.ఐదు వేలకుపైగా ధర పలకగా, ప్రస్తుతం బస్తా రూ.1000కి పడిపోయింది. రెండో రకం కాయలు రూ.1000 నుంచి రూ.500 వరకూ ధరలు పలుకుతున్నాయి. ప్రతి ఒక్క బస్తాకు రూ.150 ఖర్చు  వస్తోందని వ్యాపారులు అం టున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో నిమ్మకాయలు కేజీ రూ.180 వరకు ధర పలికింది. బయట మార్కెట్లో డజను 100 రూపాయలు చొప్పున అమ్మకాలు చేశారు. ప్రస్తుతం ఉన్న నిమ్మ ధరలకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని నిమ్మ రైతులు వాపోతున్నారు. 


Updated Date - 2022-05-27T05:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising