ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భౌబోయ్‌.. భరించలేకపోతున్నాం..

ABN, First Publish Date - 2022-02-19T05:52:20+05:30

ఎక్కడ చూసినా భౌబోయ్‌ అంటు న్నారు..ఏ గ్రామంలో చూసినా వందల సంఖ్యలో కుక్కలు పెరిగిపోయాయి.

ఆచంటలో రోడ్డుపై గుంపులుగా కుక్కలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామాల్లో కుక్కల బెడద


ఆచంట, ఫిబ్రవరి 18 : ఎక్కడ చూసినా భౌబోయ్‌ అంటు న్నారు..ఏ గ్రామంలో చూసినా వందల సంఖ్యలో కుక్కలు పెరిగిపోయాయి. దీంతో చాలా గ్రామాలకు వెళ్లాలంటేనే భయపడే పరి స్థితి.. ఎందుకంటే ఏ కుక్క ఎటు నుంచి వచ్చి మీదపడుతుందోనని జంకుతు న్నారు.గతంలో కుక్కల నిర్మూలన చర్యల కారణంగా కుక్కలు తక్కువగా ఉండేవి.. హైకోర్టు ఉత్తర్వుల కారణంగా చాలా కాలంగా కుక్కల నిర్మూలన చేపట్టడంలేదు.. దీంతో ప్రతీ గ్రామంలోనూ వందల సంఖ్యలో కుక్కల పెరిగిపోయాయి. ఆచంట మండలంలో ఇటీవల ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో కుక్కలు రోడ్లమీద విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. రాత్రి వేళల్లో అయితే పలు సెంటర్లలో కుక్కల దండు ఒకే చోట ఉండి రోడ్డు మీద వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల పెనుమంచిలిలో ఒక రైతుపై పిచ్చికుక్క దాడిచేసింది.. దీంతో అతను ఆసుపత్రి పాలయ్యాడు. ప్రతి రోజూ ఇటువంటి ఘటనలు సాధారణంగా మారాయి. అధికారులు స్పందించి గ్రామాల్లో కుక్కలు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-02-19T05:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising