ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విరివిగా విద్యారుణాలు అందించండి

ABN, First Publish Date - 2022-12-07T00:51:03+05:30

విద్యారుణాలు అందించడంపై పూన్తి దృష్టి పెట్టాలని బ్యాంకర్లను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో డిసెంబరు 31 నాటికి బ్యాంక్‌లలో డిజిటల్‌ లావాదేవీలు

బ్యాంకర్ల కమిటీ సమావేశంలో

జేసీ అరుణ్‌బాబు

ఏలూరుసిటీ, డిసెంబరు 6: విద్యారుణాలు అందించడంపై పూన్తి దృష్టి పెట్టాలని బ్యాంకర్లను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు కోరారు. మంగళవారం ఏలూరు గౌతమి సమావేశ మంది రంలో 2022–23కి సంబంధించి రెండవ త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం జేసీ అధ్యక్షతన జరిగింది. జేసీ మాట్లాడుతూ ఆశించే కోర్సుల్లో చేరటం, ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లడం చాలా మంది విద్యార్థుల కల అని వారి కలను సాకారం చేసేందుకు విరివిగా విద్యారుణాలు అందించా లన్నారు. జిల్లాలో 72.24 కోట్లు 31 బ్యాంకుల ద్వారా అందించాలని లక్ష్యానికి ఇంత వరకు 31.75 కోట్లు (44 శాతం) మాత్రమే అందించారన్నారు. ఈ దృష్ట్యా విద్యారుణాలకు అత్యంత ప్రాధాన్య తనిచ్చి నూరు శాతం లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. జగనన్నతోడు, పిఎం స్వానిధి, పీఎంఎవై, టిడ్కో రుణాలు మంజూరుపై పూర్తి దృష్టి పెట్టాలన్నారు. 2022–23 వార్షిక రుణ లక్ష్యం రూ.12807కోట్లు కాగా వ్యవసాయానికి రూ.7407 కోట్లు, ఇందులో స్వల్పకాలిక వ్యవ సాయ రుణాలకు రూ.5423 కోట్లు, స్వల్ప,మధ్య తరహా పరిశ్రమలకు రూ. 2050 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ. 800 కోట్లు , మొత్తం ప్రాధాన్యతా రంగాలకు రూ. 10257 కోట్లు, ప్రాఽధా న్యేతర రంగాలకు రూ. 2550 కోట్లు కేటాయిం చామన్నారు.మొత్తం వ్యవసాయానికి సంబంధించి రుణాలు రూ. 4633.60 కోట్లు అందించామన్నారు. గ్రామీణ డ్వాక్రా మహిళా సంఘాలకు 2022–23 సంవత్సరానికి సంబంఽధించి జిల్లా మొత్తం రుణ లక్ష్యం 27378 సంఘాలకు రూ. 1081.11 కోట్లు కాగా ఇంతవరకు 16131 సంఘాలకు రూ. 844.96 కోట్లు, పట్టణ డ్వాక్రా మహిళా సంఘాలకు 2022–23 సంవత్సరానికి గాను జిల్లా మొత్తం రుణ లక్ష్యం 1666 సంఘాలకు రూ. 49.44కోట్లు కాగా ఇంతవరకు రూ. 48.62 కోట్లు అందించా మన్నారు. డిసెంబరు 31 నాటికి ఏలూరు జిల్లాలో డిజిటల్‌ లావాదేవీలు పూర్తిస్థాయిలో నిర్వహించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. డీసీసీ కన్వీనర్‌, యూబీఐ రీజినల్‌ హెడ్‌ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ ఆర్బీఐ ప్రమాణాలకు అనుగుణంగా 2022–23 సంవత్సరానికి సంబంధించి మొత్తం రుణాలలో వ్యవసాయానికి 18 శాతం, ప్రాధా న్యతా రంగాలకు 40 శాతం రుణాలివ్వాల్సి ఉంద న్నారు. అయితే ఏలూరు జిల్లా ఈ లక్ష్యాన్ని మించి వ్యవసాయానికి 56.49 శాతం, ప్రాధాన్యతా రంగాలకు 73.16 శాతం రుణాలు ఇవ్వటం జరి గిందన్నారు. ఎల్‌డీఎం ఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు ఆర్బీఐ ఏజిఎం శరత్‌చంద్ర, నాబార్డ్‌ డీడీఎం అనిల్‌కాంత్‌, డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయరాజు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు

Updated Date - 2022-12-07T00:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising