ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
ABN, First Publish Date - 2022-12-16T23:32:52+05:30
అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నుంచి ధనుర్మాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యా యి.
పాలకొల్లు అర్బన్, డిసెంబరు 16: అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నుంచి ధనుర్మాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యా యి. ఆలయ ప్రధాన అర్చకులు కె.శ్రీనివాసాచార్యులు, పవన్‌కుమార్ స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక అలంకారం చేసి పూజలు నిర్వహించారు. ఈవో పీటీ గోవిందరావు, పాలక మండలి చైర్మన్ గాదె వెంకన్న, ట్రస్టీలు, మాజేటి శివరామ్, కెల్లా భూలక్ష్మీ, సామవేదం నగేష్, సాల శ్రీనివాస్, పి.అన్నారాణి, ఉత్సవ కమిటీ సభ్యులు మామిడి వెంకటేశ్వరరావు, నున్న వెంకట కోటేశ్వరరావు, ఆర్.ప్రవీణ్ భాను, మద్దుల లక్ష్మీ కుమారి, భక్తులు పాల్గొన్నారు. చైర్మన్ గాదె వెంకన్న మాట్లాడుతూ నెలరోజులు జరిగే కార్యక్రమాలను వివరించారు. ఉదయం 7గంటలకు రేపాక సుధారాణి వీణాగానం, 7.30కి పూలపల్లి కృష్ణమాచార్యులుచే పాశుర విన్నపం, 7.45కి మాల మార్పు కార్యక్రమాలు 8.30కి టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంద ప్రాజెక్టు తిరుప్పావై ప్రవచనాన్ని మాజేటి సూర్యభవానీ వినిపిస్తారని తెలిపారు.
ఆలయ సమీపంలోని ఖాళీ స్థలంలో శనివారం నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస వ్రత అన్న ప్రసాద వితరణ చేపట్టినట్టు చైర్మన్ గాదె వెంకన్న, ఉత్సవ కమిటీ సభ్యులు మాజేటి రాంబాబు తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 9.30 నుంచి 11గంటల వరకూ ఆలయం వద్ద భోజనం టోకెన్లు అందిస్తారని, 12 గంటలకు అన్న ప్రసాద వితరణ జరపనున్నట్టు వారు తెలిపారు.
Updated Date - 2022-12-16T23:32:54+05:30 IST