ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిపథ్‌ రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఆందోళన బాట

ABN, First Publish Date - 2022-06-28T04:50:55+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక వసంతమహల్‌ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన దీక్ష చేశాయి.

ఏలూరులో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కార్పొరేషన్‌, జూన్‌ 27: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని  రద్దు చేయాలని కోరుతూ స్థానిక వసంతమహల్‌ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన దీక్ష చేశాయి. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు మాట్లాడుతూ యువకుల జీవితాలను నాశనం చేయడం మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు లంకా రామ్మోహన్‌, ఉప్పు మురళీకృష్ణ, దండుబోయిన చంద్రశేఖర్‌, ప్రతాప సుబ్రహ్మణ్యశర్మ, సేవాదళ్‌ సుబ్బారావు, నల్లగట్ల మాణిక్యాలరావు, కొమ్మన సాంబశివరావు, మల్లేశ్వరరావు, ఈదుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

కొయ్యలగూడెం: అగ్నిపథ్‌ పథకాన్ని విరమించుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన దీక్ష చేపట్టారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా దీక్షలు చేపట్టారు.  పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పైడిముక్కల మురళీకృష్ణ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జుంగా బాబ్జీ, మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాబీ, మాజీ ఎంపీటీసీ కూనపం రాజారత్నం, సత్తిరాజు, వాసు, బుచ్చిరాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-28T04:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising