జిల్లాకు కాంప్లెక్స్ ఎరువులు
ABN, First Publish Date - 2022-01-13T05:39:35+05:30
జిల్లాకు బుధవారం భారీగా కాం ప్లెక్స్ ఎరువులు దిగుమతి అయ్యాయి.
తాడేపల్లిగూడెం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు బుధవారం భారీగా కాం ప్లెక్స్ ఎరువులు దిగుమతి అయ్యాయి. స్పిక్, కోరమాండల్, ఫ్యాక్ట్ కంపెనీకి చెందిన 20–20 ఎరువు 2760 టన్నులు దిగుమతి కాగా 14–35–14 ఎరువు 250 టన్నులు చేరింది. 800 టన్నుల యూరియా దిగుమతి చేశారు. కాంప్లెక్స్ ఎరువుల్ని ప్రైవేటు డీలర్లకు కేటాయించారు. యూరియాలో 50 శాతం మార్క్‌ఫెడ్‌కు, మరో 50 శాతం డీలర్లకు పంపిణీ చేసినట్టు వ్యవసాయ శాఖ ఏడీ మురళీ కృష్ణ తెలిపారు.
Updated Date - 2022-01-13T05:39:35+05:30 IST