ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తయిన పనికి .. వర్క్‌ ఆర్డర్‌

ABN, First Publish Date - 2022-09-24T05:26:16+05:30

పొలమూరులో జగనన్న కాలనీకి వెళ్లేందుకు పొలమూరు డ్రెయిన్‌పై రూ.12 లక్షలతో వంతెనకు గత జూన్‌ 6న నిర్మాణ పనులు చేపట్టారు.

నిర్మించిన బ్రిడ్జిని చూపిస్తున్న ఫిర్యాదుదారుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొలమూరు పంచాయతీలో విచిత్రమైన తీర్మానం

పెనుమంట్ర, సెప్టెంబరు 23 : పొలమూరులో జగనన్న కాలనీకి వెళ్లేందుకు పొలమూరు డ్రెయిన్‌పై రూ.12 లక్షలతో వంతెనకు గత జూన్‌ 6న నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం వంతెన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఎటువంటి అనుమతులు, పంచాయతీ తీర్మానం లేకుండానే పనులు పూర్తి చేశారు. ఈనెల 24న జరిగే పంచాయతీ బోర్డు మీటింగ్‌లో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు విషయాన్ని, గ్రామ కమిటీ ద్వారా పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపేలా అజెండాలో పొందుపరిచారు. ఈ విషయంపై ఈనెల 21న జనసేన వార్డు సభ్యుడు తోరం వెంకన్నబాబు స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో మండల స్థాయి అధికారులు రంగంలోకి దిగి వెంకన్న బాబును బుజ్జగించి సమస్య పరిష్కారం అయిందని సంతకం పెట్టేలా ప్రయత్నాలు చేశారు. దీనికి ఆయన నిరాకరించారు. దీంతో అధికా రులు ‘ పంచాయతీరాజ్‌ ఏఈతో కలసి విచారణ చేశాం.. ఇంకా వంతెన నిర్మా ణం పూర్తి కాలేదు.. ఎటువంటి నిధులు చెల్లించలేదు.. వింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తిచేసిన తర్వాత బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం..’ అని  ఫిర్యాదు దారుడికి లిఖితపూర్వకంగా తెలపడం గమనార్హం. ప్రస్తుత అజెండాలో మాత్రం పనులు చేపట్టేందుకు చైర్మన్‌గా పేరాబత్తుల సీతా రాముడుకు వర్కు ఆర్డర్‌ ఇచ్చేందుకు ఆమోదించడం గురించి అని స్పష్టంగా పేర్కోవడం విశేషం. పను లకు బిల్లులు చెల్లించలేదని చెబుతున్నారే తప్పా, వర్కు ఆర్డర్‌ ఎప్పుడు ఇచ్చారు, పంచాయతీ ఆమోదం లేకుండా పనులు ఎలా చేపట్టారనే విష యంపై సమాధానం చెప్పడం లేదని ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-09-24T05:26:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising