ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-06-28T04:52:57+05:30

స్పందనలో వచ్చిన దరఖాస్తులు నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు.

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌కు 298 ఫిర్యాదులు 

ఏలూరు కలెక్టరేట్‌, జూన్‌ 27: స్పందనలో వచ్చిన దరఖాస్తులు నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ అరుణ్‌బాబుతోపాటు డీఆర్వో సత్యనారా యణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఆర్డీవో పెంచల్‌కిషోర్‌ హాజరై ఫిర్యాదులు స్వీకరించారు. వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి వీడియో కాన్ఫరెన్సు ద్వారా తహసీల్దార్లకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ మాట్లా డుతూ దరఖాస్తులు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, జాప్యానికి తావు ఇవ్వద్దన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్య పరిష్కరించాలన్నారు. తగా దాలు న్యాయసంబంధమైన సమస్యలు, వృద్ధాప్యంలో ఉన్న వారి పోషణ, ఆస్థి తగా దాల సమస్యలపై స్పందనలో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని డీఎస్పీని కలెక్టర్‌ ఆదేశించారు. పంగిడిగూడెం గ్రామానికి చెందిన వి.వీరవెంకటేశ్వరరావు తన పొలం కోసం తన కుమారుడు దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు అందించారు.  ఎంనాగులపల్లికి చెందిన ఉప్పలపాడు వెంకటరత్నం పట్టాదారు పాస్‌ పుస్తకం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తంగిడిగూడెం గ్రామానికి చెందిన దాసరి సరోజని తన వాటాకు సంబంధించిన భూమికి ఆన్‌లైన్‌ చేయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై భూములు కోల్పోతున్న రైతులకు  అందిస్తున్న నష్టపరిహారం పెంచాలని రైతులు వినతిపత్రం అందజేశారు. పాతముప్పర్రుకు చెందిన కె లక్ష్మి తన కుమార్తెకు అంబేద్కర్‌ గురుకుల విద్యాలయంలో అడ్మిషన్లు ఇప్పించాలని అర్జీ అందించారు. పెదకడిమి గ్రామ సర్పంచ్‌ బలరామకృష్ణ చౌదరి పంచాయతీలోని రావులచెరువు చేపల ఫలసాయాన్ని పంచాయతీ అనుమతి లేకుండా పట్టుకువెళ్తున్నారని ఫిర్యాదు చేశారు. రావులచెరువును ఇరిగేషన్‌ చెరు వుగా చేపలు పెంచేంతదుకు అనుమతి ఇవ్వాలని గ్రామ సర్పంచ్‌ వినతిపత్రం అందజేశారు. సోమవారం స్పందనలో 298 అర్జీలు అందజేశారు. 


Updated Date - 2022-06-28T04:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising