ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలబడని టెంట్‌

ABN, First Publish Date - 2022-03-05T05:39:17+05:30

సీఎం పర్యటనలో భాగంగా తాడువాయిలోని చల్లావారిగూడెం సభ ప్రాంగణం వద్ద టెంట్‌ ఒరిగిపోయింది.

సీఎం సభ ప్రాంగణం వద్ద ఒరిగిన టెంట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, మార్చి4: సీఎం పర్యటనలో భాగంగా తాడువాయిలోని చల్లావారిగూడెం సభ ప్రాంగణం వద్ద టెంట్‌ ఒరిగిపోయింది. అప్పటికి సీఎం జగన్‌ సభ వద్దకు చేరుకోలేదు. రెండు దఫాలుగా గాలి వీయడంతో సభ వద్ద ఏర్పాటు చేసిన టెంట్‌ రెండుసార్లు ఒరిగిపోయింది. టెంట్‌లో ఏర్పాటుచేసిన కూలర్‌ కింద పడిపోవడంతో హడావుడిగా వాటిని సరిచేశారు.


అనుమతి లేదు..


సీఎం, కేంద్ర మంత్రి పర్యటన సంధర్భంగా పోలీసులు భారీగా మొహరించారు. పాస్‌లు లేకుండా ఎవరినీ అనుమతించలేదు. అక్రిడిటేష న్‌ ఉన్న చాలామంది పాత్రికేయులను సైతం లోనికి అంగీకరించలేదు. వైసీపీ నాయకులు సైతం చాలా మంది రోడ్లపైనే నిలిచిపోయారు. ఎంపీ కోటగిరి శ్రీధర్‌ కారును సైతం పోలీసులు అడ్డుకున్నారు. కారులో ఎంపీ కోటగిరి, సెక్యూరిటీ  మాత్రమే ఉండడంతో అనుమతించారు.


మట్టికొట్టారు..


సీఎం రాకతో జంగారెడ్డిగూడెం వేగవరం నుంచి తాడువాయి, చల్లావా రిగూడెం వరకు కూడా రోడ్లు తాత్కాలిక మరమ్ముతు చేశారు. జాతీయ రహదారిపై తాడువాయి వద్ద భారీ గతుల్లో మట్టి కొట్టి చేతులు దులిపే సుకున్నారు. శుక్రవారం ఉదయం రహదారిలో వాహనాల రాకపోకలతో దుమ్ము మేఘంలా కమ్మేసింది. వాహనదారులు కళ్లలో సైతం దుమ్ము పడడంతో వాహనం నడపడానికే ఇబ్బంది పడ్డారు. వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో వచ్చిన వారంతా కూడా దుమ్ము కొట్టుకుపోయారు. 

తాడువాయి నుంచి  సభ ప్రాంగణం వరకు రోడ్డు పక్కనే పోలీసులు, మహిళ సిబ్బంది నరకం చూశారు. చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ సమీపంలో నిలువ నీడ లేక ఎండ, దుమ్ములో ఇబ్బంది పడ్డారు.

Updated Date - 2022-03-05T05:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising