ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ మొద్దు నిద్రలో ఉన్నారు: గన్ని వీరాంజనేయులు

ABN, First Publish Date - 2022-07-24T19:57:31+05:30

అధికారంలో ఉండి ప్రజలను ఆదుకోవాల్సిన సీఎం జగన్ తాడేపల్లి నివాసంలో మొద్దు నిద్రలో ఉన్నాడని టీడీపీ ఏలూరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): అధికారంలో ఉండి ప్రజలను ఆదుకోవాల్సిన సీఎం జగన్ తాడేపల్లి నివాసంలో మొద్దు నిద్రలో ఉన్నాడని టీడీపీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు దుయ్యబట్టారు. గోదావరి వరదలు వలన నిరాశ్రయులైన కుక్కునూరు మండలం కొండపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి ఏజెన్సీస్ హోల్‌సేట్ ఐటీసీ డీలర్స్ జంగారెడ్డిగూడెం తరుపున టీ, బిస్కెట్లు ఇచ్చారు. అలాగే నర్సాపురం మండల టీడీపీ తరుపున దుప్పట్లు పంపిణీ చేశారు. వరద ముంపుతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవటానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ వీరాంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు కనీసం అన్నం కూడా పెట్టలేకపోవటం దారుణమన్నారు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని తెలిపారు. పునరావాస కాలనీలో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోవటం వలన ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. జగన్ బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఇప్పటికైనా ఆయన మేల్కొని నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ మూడేళ్లుగా అప్పులు చేస్తూ అస్తవ్యస్త పాలన చేస్తున్నాడని వీరాంజనేయులు ధ్వజమెత్తారు.


ఈ కార్యక్రమంలో కుక్కునూరు మండల పార్టీ అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి దూసనపూడి పుల్లయ్య నాయుడు, పొలవరం నియోజకవర్గం తెలుగుయువత అధ్యక్షులు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఆచంట అనిల్ కుమార్, ఆచంట సూర్యనారాయణ, పెద్దిన సత్యనారయణ,  రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండపల్లి రవి, స్థానిక నాయకులు కోటగిరి సత్యనారాయణ, పిచ్చుక రాజు, రమణరాజు, గుర్రం ఉదయ, నకిరికంటీ భాస్కరరావు, ఉంగుటూరు మాజీ జడ్పీటీసీ చింతల వాసు తదితరులు ఉన్నారు.



Updated Date - 2022-07-24T19:57:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising