ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం జరుగుతోంది..?

ABN, First Publish Date - 2022-03-05T06:23:27+05:30

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైన వారికి పునరావాసం నిమిత్తం ఏర్పాటు చేస్తున్న కాలనీల నిర్మాణం, వాటి నాణ్యత, అక్కడ బాధితులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారనే అంశంపైన.. మరోవైపు పోలవరం నిర్మాణ ప్రగతి, ఆటంకాలపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తన ఒక రోజు పర్యటనలో పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చారు. పలు అంశాలను క్షుణ్ణంగా ముఖ్య మంత్రిని, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రాజెక్టు వద్ద నిర్వాసితులతో మాట్లాడుతున్న సీఎం జగన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరా తీసిన కేంద్ర మంత్రి షెకావత్‌

నిర్వాసితులు, ప్రాజెక్టు నిర్మాణంపైనే దృష్టి

ఏడాదిలోపు పూర్తి చేయాలని తపన

నిర్మాణ వ్యయమంతా మాదే : షెకావత్‌ వెల్లడి

సీఎం సూచనల్లో కొన్నింటికి ఆమోదం

ఆర్థికపరమైన విషయాల వైపు స్పందనకు నో

ఇక సమీక్షల్లో కొట్టొచ్చిన కార్యాచరణ


(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైన వారికి పునరావాసం నిమిత్తం ఏర్పాటు చేస్తున్న కాలనీల నిర్మాణం, వాటి నాణ్యత, అక్కడ బాధితులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారనే అంశంపైన.. మరోవైపు పోలవరం నిర్మాణ ప్రగతి, ఆటంకాలపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తన ఒక రోజు పర్యటనలో పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చారు. పలు అంశాలను క్షుణ్ణంగా ముఖ్య మంత్రిని, అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత తాడువాయి సమీపాన చల్లావారిగూడెంలో వేల మందికి నిర్మించిన పునరావాస కాలనీలను పరిశీలించారు. ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన వారికి నివాసం కల్పించాల్సిన బాధ్యత తమ మీదే ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూనే అసలు ఏం జరుగు తుందంటూ నిర్వాసితులను ఆరా తీశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన మొత్తాన్ని కేంద్రమే భరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటిస్తూనే ఇదే విషయంలో సీఎం జగన్‌ ప్రధాని మోదీతో పలుమార్లు చర్చించారని, ప్రాజె క్టు నిర్మాణానికి నిర్ధిష్ట సమయాన్ని కేంద్రం నిర్ణయించిందన్నారు. అదే క్రమంలో ఏపీ విభజన చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదిలోపు పూర్తి చేసే విషయాన్ని ప్రకటిం చారు. వాస్తవానికి ఇంతకు ముందు జలశక్తి శాఖ మంత్రి పర్యటనకు వస్తే కేవలం ప్రాజెక్టు పురోగతి, ఆటంకాలపైనే ప్రధాన దృష్టి పెట్టేవారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే సూచనలు, సలహాలకు అక్కడికక్కడే స్పందించేవారే కాదు. కాని ఈ సారి తన పర్యటనలో కేంద్ర మంత్రి ఒకవైపు  ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి భేటీ అవుతూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు ఓపిగ్గా ఆలకించారు. తాడువాయి కాలనీ సందర్శనలో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు ప్రారం భించారని, ప్రాజెక్టు పనులు జోరందుకున్నాయని పేర్కొంటూనే మరోవైపు నిర్వాసితులకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద జరిగిన సమీక్ష లోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చేసిన సూచ నలను పరిగణనలోకి తీసుకున్నారు. అంతకు ముందే రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు నిర్వాసితుల కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని షెకావత్‌ సైతం వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతూనే ఆర్థికపరమైన విషయాలు తప్ప మిగతా అంశాలపై సీఎం చేసిన అనేక విజ్ఞప్తులను ఓకే చేయడం విశేషం. 


పీపీఏ కార్యాలయంపై సానుకూలం

పనులు చకచకా సాగాలంటే పీపీఏ కార్యాల యాన్ని రాజమహేంద్రవరంలో ఆరంభిం చాలని చేసిన సూచనకు సానుకూలం గా స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధిం చి పెండింగ్‌ బిల్లులను తమకు విడుదల చేయకపోగా నిరాకరించిన విషయంపై పీపీఏపై ఫిర్యాదు చేశారు. సీఎంతో పాటు ప్రాజెక్టు ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదు చేసేందుకు జత కలిశారు. ఈ సారి పర్యటనలో ఇదో హైలెట్‌గానే భావి స్తున్నారు. ఇంతకుముందు సీఎంలు ఎవ రైనా ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ఆ తదుపరి సమీక్షిం చడం ఆనవాయితీ. ఈసారి మాత్రం క్షేత్రస్థాయి పరిశీలన సమయాన్ని కుదించి సమీక్షకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీనిపైనా ఇంజనీర్లు ఆసక్తికరంగా చర్చించు కున్నారు. నిర్వాసితుల సమస్యలపై స్పందించేందుకు ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ఈసారి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. మీడియా సహా అనేక మందికి ఆటంకాలు ఏర్ప డ్డాయి. కేవలం కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే సమీక్షకు అనుమతి ఇచ్చారు. సమావేశానికి బీజేపీ ఎంపీ సి.ఎం.రమేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. కేంద్ర మంత్రిని కలిసేందుకు బీజేపీ నేతలు శ్రీనివాసరాజు సహా మిగతా వారం తా ప్రయత్నించినా వారికి అడ్డంకులు తప్పలేదు.


పోలవరం ప్రాజెక్టు పరిశీలన 

పోలవరం, మార్చి 4 : సీఎం జగన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌లకు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, మంత్రి వనిత, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్‌ సర్వే చేశారు. హిల్‌ వ్యూ ప్రాంతం నుంచి స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ ప్రాంతాలను, ఫొటో ఎగ్జిబిషన్‌లను పరిశీలించారు. మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్‌, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు. 


గంటలో ముగిసింది

11.44 గంటలకు సీఎం జగన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌, రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్‌  హెలీకాఫ్టర్‌లో చల్లావారిగూడెంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ వద్దకు వచ్చారు. 

12.01 గంటలకు కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను సందర్శించారు. 

12:13 గంటలకు సభ వేదిక పైకి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. 

12.40 గంటలకు సభ ముగియడంతో హెలీఫ్యాడ్‌కు బయలుదేరారు.

12.50 గంటలకు హెలీకాఫ్టర్‌లో తిరిగి అమరావతి బయలుదేరారు. 


పోలవరం.. మోదీ వరమే!

 ప్రతి గ్రామంలో, బూత్‌లో కమలం వికసించాలి

ప్రతి నేతా, కార్యకర్తా పాటుపడాలి : బీజేపీ శ్రేణులతో కేంద్ర మంత్రి షెకావత్‌

పోలవరం, మార్చి 4 : పోలవరం ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోదీ వరమేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు కుడికాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద జరిగిన బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవాళ బీజేపీ దేశంలో అతి పెద్ద పార్టీగా అవతరించిందని, కాంగ్రెస్‌ పార్టీ గతంలో రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని స్థానాలు గెలుపొందలేదని చెప్పారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఎన్నికల బూత్‌లో కమలం వికసించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారని, దానికి అనుగుణంగా ప్రతి బీజేపీ నాయ కుడు, కార్యకర్త పాటుపడాలని పిలుపిచ్చారు. ప్రపంచమంతా మోదీ నాయకత్వం వైపు చూస్తోందన్నారు. పోలవరం నిర్వాసి తులు పునరావాసాలకు తరలి వెళ్లే విషయంలో పార్టీ నాయ కులు, కార్యకర్తలు సహకరించాలన్నారు.  బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీ పీవీఎస్‌ఎన్‌ మాధవ్‌, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు హెలీప్యాడ్‌ వద్ద దిగిన షెకావత్‌ను కలవడానికి వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలను మాత్రమే పంపించడంతో పోలీ సులతో వా గ్వాదానికి దిగారు. తమను అవమానించారని మండిపడ్డారు.

Updated Date - 2022-03-05T06:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising