ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానికి వీడ్కోలు పలికిని సీఎం జగన్

ABN, First Publish Date - 2022-07-05T00:14:55+05:30

అమరావతి: ప్రధానమంత్రి మోదీకి గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడ్కోలు పలికారు. స్వాతంత్ర్య సమర యోథుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని పశ్చిమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రధానమంత్రి మోదీకి గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడ్కోలు పలికారు. స్వాతంత్ర్య సమర యోథుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఢిల్లీకి తిరిగి వెళ్తున్న ప్రధానికి  సీఎం విజ్ఞాపన పత్రం అందజేశారు. రీసోర్సు గ్యాప్‌ గ్రాంటు అంశాన్ని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. రూ.34,125.5 కోట్లను రీసోర్స్‌ గ్యాప్‌ కింద గ్రాంటుగా ఇవ్వాలని సీఎం కోరారు. తెలంగాణ డిస్కంలనుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలని, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని జగన్ కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్‌ విషయంలో హేతు బద్ధత  లేని కారణంగా  రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్ని విజ్ఞాపన పత్రంలో వివరించారు. సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని, భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు మంజూరుచేయాలని, అలాగే ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని, విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ కోరారు.

Updated Date - 2022-07-05T00:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising