ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు రైతులకు కాసుల పంట

ABN, First Publish Date - 2022-08-05T05:29:02+05:30

ప్రధాన వాణిజ్య పంటైన వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రక్రియ ముగిసింది. వేలం కేంద్రాలు మూతపడ్డాయి. వర్జీనియా పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోలు వేగవం తంగా సాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత రికార్డులు తారుమారు

సరాసరి ధర, గరిష్ట, కనిష్ట ధరల్లోనూ రికార్డు

వర్జీనియా పరిధిలో ముగిసిన వేలం ప్రక్రియ


జంగారెడ్డిగూడెం, ఆగస్టు 4: ప్రధాన వాణిజ్య పంటైన వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రక్రియ ముగిసింది. వేలం కేంద్రాలు మూతపడ్డాయి. వర్జీనియా పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోలు వేగవం తంగా సాగాయి. పొగాకు మార్కెట్‌ ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సైతం తాము పండించిన పంటను విక్రయించేశారు. అనుకూల వాతావర ణంతో ఈ ఏడాది వర్జీనియా సాగు మంచి నాణ్యమైన దిగుబడులు సాధించారు.మంచి రంగు, నాణ్యమైన పొగాకు దిగుబడి రావడంతో మొదటి నుంచి ధరలు నిలకడగా సాగాయి. మధ్యలో ఈ ఏడాది పలికిన ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. ఈ క్రమంలోనే వేలం వేగంగా సాగడంతో ఈ ఏడాది వంద రోజుల్లోనే కొనుగోలు మొత్తం పూర్తయింది.


ముగిసిన కొనుగోళ్లు

వర్జీనియా పరిధిలో జంగారెడ్డిగూడెం–1, జంగారెడ్డిగూడెం–2, గోపా లపురం, దేవరపల్లి, కొయ్యలగూడెంలలో మొత్తం ఐదు పొగాకు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 14,600 లైసెన్స్‌ బ్యారన్‌లు ఉన్నాయి. 60 వేల ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. ఈ ఏడాది 42 మిలి యన్‌ కిలోల పొగాకుకు బోర్డు అనుమతించింది. ఈ ఏడాది మార్చి 28న పొగాకు కొనుగోలు ప్రారంభం కాగా వంద రోజుల్లోనే బోర్డుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. 


గత రికార్డులు గల్లంతు..!

ఈ ఏడాది వర్జీనియా పొగాకు కొనుగోలులో గత 75 ఏళ్ల రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఈ ఏడాది గరిష్ట, కనిష్ట, సరాసరి ధరలు ఎప్పుడు చూడని విధంగా నమోదయ్యాయి. కేజీ  పొగాకు గరిష్టంగా రూ.245 ధర పలికి ఆల్‌ టైం రికార్డు సాధించగా, కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే సమయానికి కేజీ పొగాకు రూ.30 ఉండేది కానీ ఈ ఏడాది కనిష్ట పొగాకు వేలం పూర్తయ్యే సమయానికి రూ.80కు తగ్గలేదు. సరాసరి ధర రూ.191తో చరిత్ర సృష్టించింది. ఇలా ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది కొనుగోలు ప్రక్రియ కేవలం 100 రోజుల్లోనే ముగియడం ఇదో రికార్డు.  


Updated Date - 2022-08-05T05:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising