ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ లీజు అగ్రిమెంట్ల్‌తో బ్యాంకులకు టోకరా

ABN, First Publish Date - 2022-12-23T00:19:48+05:30

నకిలీ లీజు అగ్రిమెంట్ల్‌తో బ్యాంకులకు టోకరా వేసిన కేసుపై సీఐడీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురువారం మొగల్తూరు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన సీఐడీ ఎస్‌ఐ ఎండీ గౌస్‌ మోహిద్దీన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణలు రైతులను పిలిపించి వివరాలు నమోదు చేసుకున్నారు.

మొగల్తూరులో రైతుల నుంచి వివరాలు తీసుకుంటున్న సీఐడీ పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొగల్తూరులో సీఐడీ పోలీసుల దర్యాప్తు

మొగల్తూరు, డిసెంబరు 22: నకిలీ లీజు అగ్రిమెంట్ల్‌తో బ్యాంకులకు టోకరా వేసిన కేసుపై సీఐడీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురువారం మొగల్తూరు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన సీఐడీ ఎస్‌ఐ ఎండీ గౌస్‌ మోహిద్దీన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణలు రైతులను పిలిపించి వివరాలు నమోదు చేసుకున్నారు. మండలంలోని ముత్యాలపల్లి, పేరుపాలెం, మొగల్తూరు గ్రామాల్లోని కొంతమంది రైతులకు చెందిన వ్యవసాయ భూములు, మామిడి తోటల్లో ఆక్వా సాగు చేస్తున్నామంటూ కేటుగాళ్ళు నకిలీ లీజు అగ్రిమెంట్లు సృష్టించి గణప వరంలోని స్టేట్‌ బ్యాంకు నుంచి కోట్లాది రూపాయలు రుణం పొందారు. అయితే తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు పంపారు. రైతులు తమవద్ద ఉన్న దస్తా వేజులను రెవెన్యూ అధికారులు ఇచ్చిన పత్రాలను బ్యాంకు అధికారులుకు చూపడంతో బ్యాంకు ఉన్నతాధికారులు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాజమండ్రి సీఐడీ రీజినల్‌ డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిజమైన రైతుల నుంచి వివరాలు నమోదు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు. సీఐడీ ఎస్‌ఐ మోహిద్దీన్‌ మాట్లాడుతూ రైతుల నుంచి వివరాలు తీసుకుంటున్నామని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు.

Updated Date - 2022-12-23T00:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising