ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంగారెడ్డిగూడెం మండలంలో పర్యటించిన చింతలపూడి, పోలవరం ఎమ్మెల్యేలు

ABN, First Publish Date - 2022-11-27T18:15:15+05:30

జంగారెడ్డిగూడెం (Jangareddigudem) మండలం తాడువాయి అర్‌అండ్అర్ కాలనీలలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు (Bala Raju) పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): జంగారెడ్డిగూడెం (Jangareddigudem) మండలం తాడువాయి అర్‌అండ్అర్ కాలనీలలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు (Bala Raju) పర్యటించారు. డిసెంబర్ 2న టీడీపీ అధినేత చంద్రాబాబు (Chandrababu) పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నిర్వాసితులకు హడావిడిగా ఎమ్మెల్యేలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 165 మంది నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదంటూ కాంట్రాక్టర్‌పై ఇద్దరు ఎమ్మేల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసిత కాలనీల్లో ఉన్న సమస్యలను తమ దృష్టికి తెస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు కుక్కునూరు మండలంలోని కుక్కునూరు గ్రామంలో 49 మందికి కివ్వాక గ్రామంలో నలుగురికి ఇంటి పట్టాలిచ్చారు. అలాగే వేలేరుపాడు మండలంలోని శ్రీరాంపురం 120 మందికి, కొయిదా 47 మంది ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలరాజు, ఎలిజా, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండల జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, మండల కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T18:15:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising