ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా వచ్చి..అలా వెళ్లారు

ABN, First Publish Date - 2022-08-11T05:34:06+05:30

గత నెలలో గోదావరి వరదల కారణంగా నష్టం సం భంవించిన పోలవరం, వేలేరుపాడు మండలాల్లో బుధ వారం కేంద్రం బృందం పర్యటించింది. అయితే కొద్ది గంటల వ్యవధిలోనే ఈ పర్యటన ముగిసింది

బోటుపై వెళుతున్న బృందంతో కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన తీరిది

బాధితుల గోడు వినకుండానే వెనుతిరిగారు

వేలేరుపాడులో నిర్వాసితుల నిరాశ.. ఆగ్రహం


(ఏలూరు ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

గత నెలలో గోదావరి వరదల కారణంగా నష్టం సం భంవించిన పోలవరం, వేలేరుపాడు మండలాల్లో బుధ వారం కేంద్రం బృందం పర్యటించింది. అయితే కొద్ది గంటల వ్యవధిలోనే ఈ పర్యటన ముగిసింది. తమగోడు చెప్పుకునేందుకు పోలవరం నిర్వాసిత కుటుంబాలు చేసిన ప్రయత్నాలు  ఫలించలేదు. కేంద్ర బృందానికి తమ కష్టాలు వెల్లబోచ్చుకునేందుకు వేలేరుపాడులో నిర్వాసి తులు, వరద బాధితులు పెద్ద సంఖ్యలో ఎదురు చూసినా ఆ వైపు రాకుండానే మరో దిక్కున ప్రయాణించింది. దీంతో బాదిత కుటుంబాలు తీవ్ర నిరాశ చెందారు.తొలుత బుధవారం ఉదయం రాజమహేంద్రవరం నుంచి బయ లుదేరి పోలవరం సమీపాన నెక్లస్‌ బండ్‌ను పరిశీలిం చింది. వరద రికార్డు స్థాయిలో పెరిగిన తీరు పోలవరం ప్రాజెక్టు దిగువున్న ఉన్న పోలవరం గ్రామ రక్షణకు తాము తీసుకున్న చర్యలను కలెక్టర్‌ ప్రశన్న వెంకటేష్‌ వారికి వివరించారు. కేవలం కొద్ది సేపు మాత్రమే అక్కడ గడిపి అక్కడినుంచి వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఛాయా చిత్రాలను పరిశీలించారు.అక్కడ నుంచి  వరదకు తీవ్రంగా దెబ్బతిన్న వేలేరుపాడుకు చేరుకున్నారు. 


ఎందుకింత నష్టం జరిగింది..?

గోదావరి వరద సమయంలో నష్టం జరిగిన తీరును దానికి గల కారణాలను బృందం అడిగి తెలుసుకుంది. తొలుత మండల కేంద్రం వేలేరుపాడులోనూ ఆ తరువాత వేపాకుగుమ్ము, తోటకూర గుమ్ము ప్రాంతాలను బృందం పర్యటించాల్సి ఉంది. వేలేరుపాడులో అప్పటికే నివాసి తులు, వరద బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలి సినా ఆ వైపు రాకుండా కలెక్టర్‌ వెంకటేష్‌, జేసీ అరుణ్‌ కుమార్‌లతో కలిసి ప్రత్యేక పడవలో ఆ రెండు గ్రామాలు వైపు పయనమయ్యారు. దీంతో అప్పటికే గుమిగూడిన వారంతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము చెప్పు కునే అవకాశం ఇవ్వకుండా స్థానిక అధికారులే బృందాన్ని దారి మళ్లించి రేపాక గుమ్ము తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసంచారం లేకుండా నిర్మా ణుశ్యంగా ఉన్న ఈ రెండు గ్రామాలను కేంద్రం బృందం చూసింది. ఎందుకింత నష్టం జరిగింది.. ముందస్తుచర్యలు ఏం తీసుకున్నారు..? ఇప్పటి వరకు జరిగిన నష్టం నివేదికలు ఏమిటని బృందం ఆరా తీసింది. జిల్లా కలెక్టర్‌ వారు అడిగిన ప్రశ్నలకు మార్గమధ్యలో పడవమీదే సమాధానం ఇస్తూ వచ్చారు. ప్రతీ అంశాన్ని బృందం రాతపూర్వకంగా నమోదు చేసింది. కేవలం కొద్దిగంటలే ఉన్నందున వీరి పర్యటన ముగిసింది. సాయంత్రం పొద్దుపోవడంతో బృం దం హడావిడిగా రాజమహేంద్రవరానికి పయనమైంది. 



Updated Date - 2022-08-11T05:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising