ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్‌చార్జింగ్‌ రూ.50

ABN, First Publish Date - 2022-07-21T06:07:34+05:30

గోదావరి వరద కారణంగా పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి తగ్గినా పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా లంక, తీర గ్రామాల..

అయోధ్యలంక శివారు మర్రిమూలలో సెల్‌ఫోన్లకు చార్జింగ్‌ పెడుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరోవైపు వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. విద్యుత్ లేనిది ఏ పనీ జరగదని తెలుసు.. అందులోనూ ఫోన్లకు చార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అయితే మరోవైపు దీన్నే కొందరు అవకాశంగా తీసుకున్నారు. వరద బాధితుల అవసరాలను వ్యాపారంగా మార్చుకుంటున్నారు. మర్రిమూలకు చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో జనరేటర్‌ ఏర్పాటు చేసి మరీ.. ఫోన్లకు చార్జింగ్ పెడుతున్నాడు. అయితే ఇందుకోసం ఒక్కో మొబైల్‌కు రూ.50లు వరకూ తీసుకుంటున్నాడు. మొబైల్ వినియోగం తప్పనిసరి కావడంతో అంతా ఎగబడుతున్నారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని బాధితులు కోరుతున్నారు.


ఆచంట, జూలై 20: గోదావరి వరద కారణంగా పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి తగ్గినా పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా లంక, తీర గ్రామాల ప్రజలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నారు. చాలా మంది బాధితులు ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల పరిధిలో చాలా గ్రామాలు నీటి మునిగిన విషయం తెలిసిందే. పునరావాస కేంద్రాల్లో వేల సంఖ్యలో నిర్వాసితులు తలదాచుకుని ఉండగా, ముంపు ప్రాంతాల్లో సుమారు పదివేల మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-07-21T06:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising