ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ దత్తపుత్రుడు మీరా.. మేమా?

ABN, First Publish Date - 2022-05-18T06:23:47+05:30

సీబీఐ దత్తపుత్రుడు మీరా.. మేమా?

విలేకరులతో మాట్లాడుతున్న జనసేన జిల్లా అధ్యక్షుడు గోవిందరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకు, మే 17: సీబీఐకి దత్తపుత్రుడు మీరా.. మేమా? అని సీఎం జగన్‌ను జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ప్రశ్నించారు. మంగళవారం మండపాకలో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. తమ నాయకుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరికీ చెప్పనక్కర్లేదని, మీరు సీబీఐకి చెప్పాలని ఎద్దేవా చేశారు. గణపవరం సభలో జగన్‌ అబద్ధాలు చక్కగా చెప్పారన్నారు. మేనిఫెస్టోలో రైతు భరోసా రూ.19 వేల 500 పెట్టి, కేంద్రంతో కలిపి రూ.13 వేల 500 ఇస్తున్నారన్నారు. పవన్‌ కల్యాణ్‌ సొంత నిధులతో కౌలు రైతులు కుటుంబాలను ఆదుకుంటే  విమ ర్శించడం తగదని హితవు చెప్పారు. అమ్మ ఒడి ఒక విడత ఆపేశారని, స్థానిక సంస్థల నిధులు లాక్కున్నారని, కేంద్ర ప్రభుత్వ నిదులను 11 వందల కోట్లు కరోనా సమయంలో వాడుకున్నారని గోవిందరావు ఆరోపించారు.  ఫీజు రీయింబర్స్‌మెంటు లేదని, జాబ్‌ కేలెండర్‌ విడుదల చేయడం లేదన్నారు. తణుకు ఇన్‌చార్జి విడివాడ రామచంద్రరావు, తాడే పల్లిగూడెం ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాసరావు, చేగొండి సూర్యప్రకాష్‌, వెం కటలక్ష్మి, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T06:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising