ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతలపూడి కాల్వ గట్టు తవ్వేస్తున్నారు

ABN, First Publish Date - 2022-03-05T05:50:04+05:30

చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు కొంతకాలంగా నిలిపోవడంతో అక్రమార్కులకు కలిసి వచ్చింది.

చింతలపూడి కాలువ మట్టి అక్రమ తరలింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీలుగుమిల్లి, మార్చి 4: చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు కొంతకాలంగా నిలిపోవడంతో అక్రమార్కులకు కలిసి వచ్చింది. కాలువ గట్టు తవ్వేసి మట్టి విక్రయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమీ ప గ్రామాల వారు కొందరు మట్టి వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవల రాత్రి పగలు తేడా లేకుండా ఎక్స్‌కవేటర్లతో మట్టి తవ్వి, ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ట్రాక్టరు మట్టి రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. సమీపంలో పలు నర్సరీలకు సైతం మట్టిని విక్రయించి కొందరు సొమ్ము చేసుకుం టున్నట్లు సమచారం. నిత్యం కాలువ గట్టు తవ్వి తరలిస్తున్నా పట్టించు కునే నాథులే లేరు. ఇటీవల శివరాత్రి ఉత్సవాలకు అధికారులకు ఆలయాల వద్ద విధులు కేటాయించడంతో రెవెన్యు అధికారులు అందుబాటులో లేరు. ఇదే అదనుగా టన్నుల కొద్దీ మట్టిని తరలించేశారు. కొండలాంటి కాలువ గట్లు తరిగిపోయి కనిపిస్తున్నాయి. కాలువ గట్టు తవ్వకం విషయమై ఏఈ ఫణీంద్రను ఫోన్‌లో వివరణ కోరగా అక్రమంగా మట్టి తరలించే వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు.



Updated Date - 2022-03-05T05:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising