ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెనుకబడిన కులాల పరిస్థితి ఇంకా దయనీయమే

ABN, First Publish Date - 2022-09-26T06:20:31+05:30

స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లయినా వెనుకబడిన కులాల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వీరవల్లి శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 25 : స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లయినా వెనుకబడిన కులాల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమగ్ర కుల గణన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆయన అధ్య క్షత వహించి మాట్లాడారు. సమగ్ర కులగణన జరిపించాలని సోషల్‌ మీడియా ద్వారా వివిధ గ్రూపుల్లో ప్రాచుర్యం పొందే మొదటి సమావేశం విజయవాడలో నిర్వహించామని తెలిపారు. దేశ జనాభా లెక్కల సేకరణ 1931 తరువాత సుమారు 8 సార్లు జనగణన జరిగినప్పటికీ బీసిల గణనను కుట్రపూరితంగా పక్కన పెట్టారన్నారు. పాకా వెంకట సత్యనారాయణ, మునిసిపల్‌ మాజీ ఛైర్మన్‌ మెరగాని నారాయణమ్మ, మాజీ ఎంపీపీ వీరవల్లి చంద్రశేఖర్‌ మాట్లాడారు. కోడే యుగంధర్‌, పామర్తి జయప్రకాష్‌, మద్దులూరి శ్రీనివాస్‌, మల్లువలస రాము, పడమట సోమేశ్వరరావు, కడియం సూరిబాబు, నడిపూడి సూర్యనారాయణ, మైలాబత్తుల ఐజాక్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T06:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising