ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. కోట్లు కొట్టేశారు !

ABN, First Publish Date - 2022-12-16T00:11:44+05:30

వందలు, వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ.కోట్లు. చేపల చెరువుల అసలు యజమానులకు తెలియకుండా వారి ప్రమేయం ఏమ్రాతం లేకుండా వారి చెరువులు లీజుకు తీసుకున్నట్టుగా పత్రాలు సృష్టించి రూ.కోట్లలో రుణాలు తీసుకున్న బాగోతం బయటపడింది.

బందరు వెస్ట్‌ రెవెన్యూ పరిధిలోని చేపల చెరువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బందరులో చెరువులు.. భీమవరం బ్యాంకుల్లో రూ.కోట్లలో రుణాలు

అసలు రైతులకు తెలియకుండా లీజు తీసుకున్నట్టుగా పత్రాలు

114 ఎకరాల పేరుతో రుణం.. ఇప్పటికి బయటపడింది రూ.9 కోట్లు

కంగుతిన్న అసలు యజమానులు..తలలు పట్టుకున్న బ్యాంకు అధికారులు

వందలు, వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ.కోట్లు. చేపల చెరువుల అసలు యజమానులకు తెలియకుండా వారి ప్రమేయం ఏమ్రాతం లేకుండా వారి చెరువులు లీజుకు తీసుకున్నట్టుగా పత్రాలు సృష్టించి రూ.కోట్లలో రుణాలు తీసుకున్న బాగోతం బయటపడింది. భీమవరానికి చెందిన బడాబాబులు 2016లో గుట్టుచప్పుడు కాకుండా జరిపించిన ఈ అవినీతి తంతు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు..ఏకంగా 20 మంది మచిలీపట్నం రైతుల కళ్లుగప్పి రూ.కోట్లు కొట్టేశారు.

(ఆంధ్రజ్యోతి–మచిలీపట్నం )

మచిలీపట్నంలోని బందరు వెస్ట్‌ రెవెన్యూ పరిధిలో 3వేల ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూమిలో అధికశాతం చేపల చెరువులే ఉన్నాయి. భీమవరానికి చెందిన కొందరు బడాబాబులు బందరు వెస్ట్‌ రెవెన్యూ ప్రాంతంలో చేపల చెరువులు సాగు చేస్తున్నారు. తాము సాగు చేసే భూముల పక్కనే ఉన్న స్థానిక రైతుల భూమి సర్వే నెంబర్లు, పట్టాదారు పాస్‌ పుస్తకాల నెంబర్లు, చెరువులు తవ్వే సమ యంలో మత్స్యశాఖ అనుమతుల కోసం అసలు రైతులు పెట్టుకున్న పత్రాలను సేకరించారు. భూమి యజమానులకు తెలియ కుండానే రైతుల వద్ద తాము చేపల చెరువులను లీజుకు తీసుకు న్నట్టుగా పత్రాలు సృష్టించారు. భూములకు సంబంధించిన అన్ని పత్రాలను చూపి చేపల పెంపకం, మేత, ఇతరత్రా ఖర్చుల రూపంలో 2016లో భీమవరంలోని వివిధ బ్యాంకుల్లో భారీమొత్తంలో రుణాలు తీసుకున్నారు.

ఇలా బయటపడింది

మచిలీపట్నంలోని శారదానగర్‌కు చెందిన మేడింపూడి రాజేంద్రప్రసాద్‌ అనే రైతు తనకున్న మూడెకరాలకు రుణం కావాలని శివగంగ పీఏసీఎస్‌కు వెళ్లాడు. పీఏసీఎస్‌లో లోన్‌ చార్జింగ్‌ పరిశీలన చేసిన సమయంలో భీమవరంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.3.50 కోట్లు రుణం తీసుకున్నట్లుగా కనిపించడంతో ఆయన కంగుతిన్నాడు. భీమవరంలోని బ్యాంకులో రుణం తీర్చినట్టుగా ఎన్‌వోసీ తెస్తే రుణం ఇస్తామని తేల్చిచెప్పారు. దీంతో మిగతా రైతులు కూడా వారి భూముల వివరాలను పరిశీలించారు. మేడింపూడి సతీష్‌ పేరున రూ.2.50 కోట్లు, వేమూరి ఈశ్వర్‌ పేరున మరో రూ.3 కోట్లు.. ఇలా 20 మంది రైతుల పేరున 114 ఎకరాలకు కోట్లాది రూపాయల రుణం తీసుకున్నట్లుగా బయటపడింది. మొత్తంగా 1,400 ఎకరాలకు సంబంధించి ఈ తరహాలో రుణాలు తీసుకు న్నారని, వందల కోట్లు అక్రమంగా, అసలు రైతులకు తెలియకుండానే ఇచ్చేశారని తెలిసింది. 2.50 ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబరుపై భీమవరానికి చెందిన ఒక కుటుంబంలోని భర్తకు, భార్యకు ఒకే రోజున ఒకే బ్యాంకులో రూ.3 కోట్ల వరకు రుణాలు ఇచ్చారని వెల్లడైంది.

అన్నీ నకిలీ పత్రాలే..

తమ భూములపై తమకు తెలియకుండా చేపల పెంపకం, సాగు పేరుతో కోట్లాది రూపాయలు రుణాలు ఎలా ఇచ్చారని బంద రుకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ వద్ద పత్రాలు తీసుకుని వెళ్లి బ్యాంకు అధికారులకు చూపారు. పేరొందిన ఒక పబ్లిక్‌ స్కూల్‌ యజమాని, ఆయన భార్య.. తాము చేపల చెరువులు లీజుకు తీసుకున్నామని, చేపల పెంపకం, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం రుణం తీసుకున్నట్టుగా పత్రాలు బ్యాంకులకు సమర్పించి నట్టు బ్యాంకు అధికారులు బందరు రైతులకు తెలిపారు. అవన్నీ తమకు తెలియదని,భూములు లీజుకు ఇచ్చినట్లు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల నెంబర్లు, సర్వే నెంబర్లు, లీజుకు ఇచ్చినట్లుగా రాసిచ్చిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని అక్కడి బ్యాంకు అధికారులు తెలిపారు. సర్వే నెంబర్లు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు తమవేనని, తమ భూములను తామే సాగు చేసుకుంటున్నామని, ఎవరికీ లీజుకు ఇవ్వలేదని, ఎలాంటి సంతకాలు చేయలేదని పత్రాల్లో ఉన్నవి తమ సంతకాలు కాదని రైతులు తెలిపారు. మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఆ పత్రాలను బ్యాంకు అధికారులకు చూపారు. 15 రోజుల్లో విచారణ చేస్తామని, రుణాలు పూర్తిస్థాయిలో కట్టించుకుని ఎన్‌వోసీ ఇస్తామని బ్యాంకు అధికారులు బందరుకు చెందిన రైతులకు నచ్చజెప్పి పంపుతున్నారు. రుణాలు తీసుకున్న వారు వాటిని చెల్లించకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

మాకు తెలియకుండానే..

– మేడింపూడి రాజేంద్రప్రసాద్‌, మచిలీపట్నం

నా పేరున, నా భార్య పేరున ఉన్న భూమిని మేమే సాగు చేసుకుంటున్నాం. ఇటీవల శివగంగ పీఏసీఎస్‌కు వెళ్లి రుణం ఇవ్వమని కోరితే, భీమవరంలోని బ్యాంకుల్లో రూ.3.50 కోట్ల రుణం తీసుకున్నారని చూపించిందన్నారు. ఆ మొత్తం చెల్లించి ఎన్‌వోసీ తీసుకొస్తేనే రుణం ఇస్తామంటు న్నారు. భీమవరంలోని బ్యాంకులకు వెళ్తే మా భూములను లీజుకు ఇచ్చినట్టుగా భూమి పత్రాలకు సంబంధించిన అన్ని ఆధారాలు చూపుతున్నారు. బ్యాంకు అధికారులు చూపిన పత్రాల్లోని సంతకాలు మావి కాదు. దీనిపై విచారణ చేయాలి.

అధికారుల సహకారంతోనే..

– మేడింపూడి అనిల్‌బాబు, మచిలీపట్నం

మా కుటుంబ సభ్యులకు చెందిన భూములను లీజుకు తీసుకున్నట్టుగా చూపి, కోట్లాది రూపాయల రుణాలను భీమవరం బ్యాంకుల్లో తీసుకున్నారు. ఇక్కడి భూముల సర్వే నెంబర్లు, పట్టాదారు పాస్‌ పుస్తకాల ఖాతా నెంబర్లు, మత్స్యశాఖకు చేపల చెరువుల తవ్వకం నిమిత్తం అసలు భూమి యజమానులు పెట్టుకున్న దర ఖాస్తులు భీమవరంలోని బ్యాంకులకు ఎలా చేరాయి. ఇందులో ఎవరి పాత్ర ఉందో తెలియాలి. దోషులను శిక్షించాలి.

Updated Date - 2022-12-16T00:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising