ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముళ్లపొదల నుంచి అమ్మ ఒడికి..

ABN, First Publish Date - 2022-09-26T05:36:52+05:30

ముళ్ల పొదల్లో బయటపడ్డ శిశువు మళ్లీ తల్లి ఒడికి చేరాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 24 గంటల్లో తల్లిని గుర్తించిన పోలీసులు

 విజయవాడ చైల్డ్‌కేర్‌ సెంటర్‌కు తల్లీబిడ్డలు

ఆగిరిపల్లి, సెప్టెంబరు 25 : ముళ్ల పొదల్లో బయటపడ్డ శిశువు మళ్లీ తల్లి ఒడికి చేరాడు. బిడ్డను పెంచే స్థోమత లేక తల్లి ఈ చర్యకు పాల్పడినా.. పోలీసులు గుర్తించి బిడ్డను ఆమెకు అప్పగించి వీరిద్దరిని విజయవాడ చైల్డ్‌కేర్‌ సెంటర్‌కు తరలించారు. ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు తెలిపిన వివరాలివి.. ఆగిరిపల్లి పీహెచ్‌సీ సమీపంలోని వడ్లమాను కొండకాలనీకి చెందిన ఓ మహిళకు మూడేళ్ల క్రితం వివాహం కాగా వారికి రెండేళ్ల వయసున్న పాప ఉంది. ఆమెకు భర్తతో గొడవల కార ణంగా కొంతకాలంగా కొండ కాలనీలో తల్లి వద్ద ఉంటుంది. మళ్లీ గర్భం దాల్చ డంతో బిడ్డను ప్రసవించింది. తానే తల్లిదండ్రులపై ఆధార పడి జీవిస్తుంటే పుట్టిన బిడ్డ వారికి మరింత భారం అవు తుందని భావించి ముళ్లపొదల్లో వదిలేసింది. శనివారం ముళ్లపొదల నుంచి శిశువు ఏడుస్తూ కనిపించడంతో స్థాని కులు పోలీసులకు సమాచారం అందజేశారు. వారు ఐసీడీసీ అధికారుల సహకారంతో విజయవాడలో ఆసుపత్రికి తర లించారు. ఆ తర్వాత తల్లిని గుర్తించి శిశువును అప్పగించా రు. వీరిని చైల్డ్‌కేర్‌ సెంటర్‌ పర్యవేక్షణలో ఉంచినట్టు ఎస్‌ఐ వివరించారు.


Updated Date - 2022-09-26T05:36:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising