ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పౌష్టికాహారంతో గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యం

ABN, First Publish Date - 2022-09-08T05:42:23+05:30

పౌష్టికాహారం తీసుకోవడంద్వారా గర్భిణులు, బాలింతలు ఆరోగ్యవంతంగా ఉంటారని వైఎస్‌ ఎంపీపీ లక్ష్మీతులసీ అన్నారు.

పెన్నాడలో గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకోడేరు, సెప్టెంబరు7: పౌష్టికాహారం తీసుకోవడంద్వారా గర్భిణులు, బాలింతలు ఆరోగ్యవంతంగా ఉంటారని వైఎస్‌ ఎంపీపీ లక్ష్మీతులసీ అన్నారు. పెన్నాడ అగ్రహారంలో పౌష్టికాహారం వారోత్సవాలలో భాగంగా బాలింతలకు బుధవారం పౌష్టికాహారం అందజేసి చిన్నపిల్లకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీతులసీ మాట్లాడుతూ గర్భిణులకు పౌష్టికాహారంతోపాటు వైద్యసేవలు అందించడం జరిగిందన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ సుజాతలక్ష్మి, వైద్యసిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. 


పాలకొల్లు రూరల్‌: గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహారం లోపిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఎంపీహెచ్‌సీవో గుడాల హరిబాబు అన్నా రు. పోషకాహార మాసోత్సవం సందర్భంగా కాపవరం సచివాలయంలో అవ గాహన సదస్సు నిర్వహించారు. పి.వెంకట నారాయణ, కెఎం సుజ్ఞా నమణి, పీవై.తేజ, ఈవో సురేష్‌ కుమార్‌, అంగన్‌వాడీలు కె.మసేనమ్మ, కె.లలితకు మారి, వై.పద్మావతి, ఎస్‌.సుబ్బలక్ష్మి, ఎ.భవాని, ఆశాలు పాల్గొన్నారు.


ఇరగవరం: అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేలంగి సర్పంచ్‌ చేబ్రోలు స్వరాజ్యం అన్నారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రేలంగి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, తల్లులకు పోషణపై అవగాహన కల్పించారు.


అత్తిలి: పిల్లలకు నాణ్యమైన ఆహారం ఇస్తే బలంగా ఉంటారని ఐసీ డీఎస్‌ సూపర్‌వైజర్‌ ఎం.శ్రీదేవి అన్నారు. అత్తిలి అంగన్వాడీ కేంద్రంలో కమ్యూనిటీ ఈవెంట్‌ నిర్వహించారు. బిడ్డకు ఆరో నెల నుంచి ఇవ్వాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ కార్యకర్త పద్మశ్రీ, మహిళా పోలీసు జానకి, ఏఎన్‌ఎం రాజేశ్వరి  తదితరులు  పాల్గొన్నారు.


పెంటపాడు: అంగన్వాడీ కేంద్రాలు అందించే పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సీడీపీవో సరస్వతి అన్నారు. పెంటపాడులో గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. సర్పంచ్‌ తాడేపల్లి సూర్యకళ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎం.రాజేశ్వరరావు, ఎంపీటీసీ  సూరిబాబు, డాక్టర్‌ శిరీష, సూపర్‌వైజర్‌ దుర్గాభవాని, ఐసీడీఎస్‌, వైద్య  సిబ్బంది  పాల్గొన్నారు.

Updated Date - 2022-09-08T05:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising