ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య మిత్రలను రెగ్యులర్‌ చేయాలి

ABN, First Publish Date - 2022-08-12T05:49:59+05:30

ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో విధులు బహిష్కరించి డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ఆందోళన చేస్తున్న ఆరోగ్య మిత్రలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, ఆగస్టు 11 : ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో విధులు బహిష్కరించి డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎ.నాగబాబు మాట్లాడుతూ పదహారేళ్ళుగా తక్కువ జీతంతో ఆరోగ్య మిత్రలు పని చేస్తున్నారని, వారికి క్యాడర్‌ వన్‌గా పదోన్నతి ఇచ్చి జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. గౌరవాధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు మాట్లాడుతూ జగన్‌ పాదయాత్ర సమయంలో ఆరోగ్య మిత్రలను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. సర్వీసు వెయిటేజ్‌ ఇచ్చి జీతభత్యాలు పెంపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి బి.రామ్మోహన్‌, సుశీల, రాధాకుమారి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T05:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising