ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: టీడీపీతోనే జగన్ అరాచక పాలన అంతం : బొరగం శ్రీనివాసులు

ABN, First Publish Date - 2022-09-19T02:56:02+05:30

జంగారెడ్డి గూడం, ఏలూరు జిల్లా: సీఎం జగన్ అరాచక పాలనకు అంతం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పేర్కొన్నారు. జిలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలో నిర్వహించిన ‘బాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డి గూడం, ఏలూరు జిల్లా: సీఎం జగన్ (CM Jagan) అరాచక పాలన  అంతం ఒక్క తెలుగుదేశం (TDP) పార్టీతోనే సాధ్యమని టీడీపీ పోలవరం (Polavaram) నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పేర్కొన్నారు. జిలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ (Badude Badudu) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడడం జగన్ అవకాశవాదానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి జై కొట్టి.. ఇప్పడేమో పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తిరిగి తెరపైకి తెచ్చి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు పేరుతో పరిమితికి మించి అప్పులు తెస్తూ.. వాటిని తీర్చేందుకు ప్రజల నుంచి కరెంట్ చార్జీల రూపంలో, బస్సు చార్జీల రూపంలో లాగుతున్నాడని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. హామి నిలబెట్టుకోగా పోగా.. జే బ్రాండ్స్ పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన పోవాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీని ఆదరించాలని కరపత్రాలు పంచిపెట్టారు.  కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సుంకవల్లి సాయికృష్ణ, తెలుగురైతు ఏలూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఉండవల్లి సోమసుందరం,  పంచాయతీ సర్పంచ్ వనమా రాంబాబు, ఎంపీటీసీ నాలి శ్రీను, పీ అంకన్నపాలెం సర్పంచ్ బుద్దా జగ్గారావు, నేర్సు నరసింహ, రావూరి నాగేశ్వరరావు, కోడెల్లి  చిన్ని, గందం వెంకటేశ్వరరావు,  తెలుగుయువత మండల అధ్యక్షులు ఆకిరెడ్డి ప్రసాద్,  వెలగల అజయ్, గద్దె సుబ్రహ్మణ్యం యాండ్ర శేఖర్ బాబు, అంజరి సత్యనారాయణ, పి రాజవరం  పార్టీ గ్రామ అధ్యక్షులు దొంగా మురళి, నల్లపు దుర్గారావు  తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-09-19T02:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising