ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జగన్‌ను గద్దె దించడం ఒక్క టీడీపీతోనే సాధ్యం : బొరగం శ్రీనివాసులు

ABN, First Publish Date - 2022-09-07T01:38:32+05:30

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కేవలం ఒక్క టీడీపీతోనే సాధ్యమని పోలవరం టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పేర్కొన్నారు. జిలుగుమిల్లి మండలంలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ అసమర్థ పాలనను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా జగన్ పాలన విధానాన్ని బొరగం శ్రీనివాసులు తూర్పారబట్టారు. అధికారంలోకి రాగానే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన జగన్ ఆ హామీని నిలబెట్టు కోకపోగా..జే - బ్రాండ్స్ పే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కేవలం ఒక్క టీడీపీ (TDP)తోనే సాధ్యమని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పేర్కొన్నారు. జిలుగుమిల్లి మండలంలో నిర్వహించిన  ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ (CM Jagan) అసమర్థ పాలనను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా జగన్ పాలన విధానాన్ని బొరగం శ్రీనివాసులు తూర్పారబట్టారు. అధికారంలోకి రాగానే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన జగన్ ఆ హామీని నిలబెట్టు కోకపోగా..జే - బ్రాండ్స్ పేరుతో మద్యం మాఫియాకు తెగబడ్డాడని ఆరోపించారు. నిజమైన అర్హులకు జగన్ సంక్షేమ పథకాలు వర్తించడం లేదని మండిపడ్డారు. వైసీపీ (YSRCP) నాయకుల తప్పులను ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, దాడులు చేయడం జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నాలి శ్రీను, సర్పంచ్ బుద్దా జగ్గారావు, టీడీపీ కొరుటూరు గ్రామ అధ్యక్షుడు కొండ్ల రమేష్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గంటా వెంకటేశ్వరరావు, పేరుబోయిన దుర్గారావు, చీమకుర్తి కృష్ణారావు, కలుము కళ్యాణ్, నడబల శివాజీ, సంకురు రమేష్ రెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 







Updated Date - 2022-09-07T01:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising