ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సీఎం అఖిలపక్షాన్ని పోలవరం తీసుకెళ్లాలి: లోక్ సత్తా పార్టీ

ABN, First Publish Date - 2022-08-19T22:06:33+05:30

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు ముఖ్యమంత్రి జగన్ అన్ని రాజకీయ పార్టీల నాయకులను అక్కడికి తీసుకెళ్లేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) గురించిన వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అన్ని రాజకీయ పార్టీల నాయకులను అక్కడికి తీసుకెళ్లేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. శుక్రవారం ఏలూరు‌లో సీపీఐ (CPI) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర‌స్థాయి అగ్రిగోల్డ్ బాధితుల రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేఖరులతో బాబ్జి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా పడకేయడం వెనుక ఎవరి పాత్ర ఎంతో తెలియాలంటే అక్కడికి వెళ్లాల్సిందేనని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి కారణం గత ప్రభుత్వ విధానాలే అని చెప్పిన జగన్ ప్రభుత్వం.. తాజాగా ఐఐటీ హైదరాబాద్ నివేదిక సమర్పించగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై తప్పు నెట్టడం విచిత్రంగా ఉందన్నారు. సమావేశంలో మాతృ భూమి సేవా సంఘం అధ్యక్షుడు గోపాలరావు, రాష్ట్ర అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఇవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T22:06:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising