అమరావతి విజయం రైతులదే
ABN, First Publish Date - 2022-03-05T05:34:09+05:30
ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము అన్నారు.
జంగారెడ్డిగూడెం, మార్చి 4: ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము అన్నా రు. ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, తెలుగు యువత అధ్యక్షుడు కోనే టి చంటి, ప్రధాన కార్యదర్శి చిత్తపురి దుర్గేష్ ఆధ్వర్యంలో శుక్రవారం సమా వేశం నిర్వహించారు. రాము మాట్లాడుతూ ఇది అమరావతి రైతుల విజ యమన్నారు. మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. కంపా రాజేంద్ర, కాసాని ప్రసాద్, ఈర్ని సూరిబా బు, కర్ణం రాంబాబు, షేక్ యాకుబ్, పొదిలి ఫణిశర్మ, తెలగారపు ఆనంద్, యడ్లపల్లి ఏడుకొండలు, కొంచాడ ఉమాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. గణేశ్ ఆలయంలో శుక్రవారం ఉదయం కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అమరావతి ప్రజలకు హైకోర్టు తీర్పు ఎంతో ఊరటనిచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగపడే ప్రదేశమని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారని, దీనికి ప్రజలంతా ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. వైసీసీ ప్రభుత్వం మూడు రాజఽధానుల పేరుతో ముక్కలు చేయాలని చూసిందన్నారు. ప్రజల పక్షాన హైకోర్టు తీర్పు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వాడపల్లి నాగార్జున, గంగిరెడ్ల మేఘలాదేవి, చింతల వెంకటరమణ, బెల్లాని శ్రీను, రమాదేవి, గుడిమెట్ల శేషారావు, మేకల ప్రసాద్, రాచూరి మధన్, రాఘవ, వెంకటరమణ, కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T05:34:09+05:30 IST