ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రండి.. భోజనం చేయండి

ABN, First Publish Date - 2022-06-30T05:45:58+05:30

అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం నుంచి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంగన్‌వాడీ కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజనం పునరుద్ధరణ

జూలై 1 నుంచి పునః ప్రారంభం.. 

జిల్లాలో 1,47,275 మంది బాలింతలు, గర్భిణులు, చిన్నారులు

గణపవరం, జూన్‌ 29 : అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం నుంచి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానుంది. గర్భిణులు, బాలింతల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి నిలిపివేశారు. రెండేళ్ల తర్వాత దీనిని తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ వెంకటేశ్వరి తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించిన ఏర్పాట్లను మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం సరఫరా చేస్తున్న ముడిపోషకాలను 30వ తేదీ వరకు లబ్ధిదారులకు అందిస్తారు. ఒకటో తేదీ నుంచి బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వండిన ఆహారాన్ని పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించిన మోనూను మహిళా శిశు సంక్షేమ శాఖ రూపొందించింది. ఆరేళ్లలోపు పిల్లలు లక్షా 22 వేల 392 మంది, గర్భిణులు 13,903 మంది, బాలింతలు 10,980 మంది మొత్తం వెరసి లక్షా 47,275 మంది లబ్ధిదారులు ఉన్నారు. 

ఏ రోజు ఏం పెడతారు ? 

సోమవారం  : తల్లులకు అన్నం, దోసకాయ పప్పు, కోడి గుడ్డు కూర, 200 మిల్లిలీటర్ల పాలు

పిల్లలకు అన్నం, దోసకాయపప్పు, ఉడికించిన కోడి గుడ్డు, 100 ఎంఎం పాలు 

మంగళవారం : తల్లులకు అన్నం, టమాట పప్పు, కోడి గుడ్డు కూర, 200 ఎం.ఎం పాలు 

పిల్లలకు పులి హోర, టమాట పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, 100 ఎం.ఎం పాలు 

బుధవారం  : తల్లులకు అన్నం, ఆకుకూర పప్పు, కోడి గుడ్డు కూర, 200 ఎం.ఎం పాలు 

పిల్లలకు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడి గుడ్డు, 100 ఎం.ఎం పాలు 

గురువారం : తల్లులకు ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, 200 ఎం.ఎం పాలు 

పిల్లలకు అన్నం, ఆకు కూర, ఉడికించిన కోడిగుడ్డు, 100 ఎం.ఎం పాలు 

శుక్రవారం : తల్లులకు అన్నం బీరకాయ, లేదా మునగా కు లేదా పాలకూరతో, గుడ్డు కూర, 200 ఎం.ఎం పాలు  పిల్లలకు అన్నం, సోరకాయ పప్పు, ఉడికించిన గుడ్డు, 100 ఎం.ఎం పాలు 

శనివారం : తల్లులకు వెజిటేబుల్‌ రైస్‌, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, 200 ఎం.ఎం పాలు 

పిల్లలకు వెజిటేబుల్‌ రైస్‌, ఆకుకూర, ఉడికించిన గుడ్డు, 100 ఎం.ఎం పాలు ఇస్తారు.  . 


Updated Date - 2022-06-30T05:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising