ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మ ఒడికి కోత

ABN, First Publish Date - 2022-05-26T05:54:36+05:30

అమ్మఒడి పథకానికి ప్రభుత్వం రూ. రెండువేలు కోత పెట్టాలని నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.15 వేలకు ఇచ్చేది రూ.13 వేలే

గతంలోనే రూ. వెయ్యి కట్‌

తాజాగా మరో వెయ్యి


ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 25 : అమ్మఒడి పథకానికి ప్రభుత్వం రూ. రెండువేలు కోత పెట్టాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఇవ్వాల్సిన రూ.15 వేలలో ఇప్పటికే రూ.వెయ్యి కోత విధించి రూ. 14 వేలు ఇస్తోన్న ప్రభుత్వం తాజాగా మరో వెయ్యి మినహాయించుకుని రూ.13 వేలను అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలకు జమచేయనుంది. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ. వెయ్యి ఇప్పటికే తగ్గిస్తోంది. మళ్లీ ఇపుడు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల నిర్వహణకంటూ మరో రూ. వెయ్యి తగ్గించేందుకు సిద్ధపడింది. ఇలా లబ్ధిదారుల నుంచి మినహాయించుకున్న మొత్తాన్ని జిల్లా విద్యాశాఖ ద్వారా పాఠశాలల నిర్వహణకు వినియోగిస్తారు. వాస్తవానికి పాఠశాలల నిర్వహణకు ఏటా సమగ్రశిక్ష ప్రాజెక్టు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిఽఽధులు కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మ ఒడి భారాన్ని తగ్గించుకునేందుకే పలు కఠిన షరతులు పెట్టిన ప్రభుత్వం, అదే క్రమంలో ఇపుడు లబ్ధిదారులను తగ్గిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ–కేవైసీ షరతుల వల్ల పలువురు ఈ పథకానికి అనర్హులయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకోవైపు హాజరు శాతం సరిపోలేదంటూ విద్యార్థులను అర్హుల జాబితా నుంచి ఎడాపెడా తొలగించారు.


జిల్లాలో 1.72 లక్షల మంది లబ్ధిదారులు

జిల్లాలో ఈ ఏడాది 2,64,457 మంది విద్యార్థులను అమ్మఒడి పథకానికి అర్హులుగా ప్రాఽథమికంగా నిర్ధారించారు. వీరిలో 1,72,749 మంది తల్లులను ఆర్థిక సాయానికి అర్హులుగా గుర్తించారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల్లో అర్హుల సంఖ్య ఇంకా తేలాల్సి ఉంది. 


Updated Date - 2022-05-26T05:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising