ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా దేశాలమ్మ జాతర

ABN, First Publish Date - 2022-05-24T05:22:23+05:30

పట్టణంలో లాకుల వద్ద దేశాలమ్మ జాతర సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, మే 23: పట్టణంలో లాకుల వద్ద దేశాలమ్మ జాతర సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. రాత్రి 8 గంటలకు యలమంచిలి మండలం శిరగాల పల్లి సర్పంచ్‌ చిలుకూరి సుబ్బారావు చౌదరి అమ్మవారికి పూజలు చేసి జాతర ప్రారంభిం చారు. లాకుల నుంచి అన్నపూర్ణ థియేటర్‌ వరకూ 12 స్టేజీలు వేసి సాంస్కృతిక కార్య క్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధానా ర్చకులు మద్దిరాల జనార్ధనశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గరగ నృత్యాలు, బేతాళ వేషాలు, కోయ డ్యాన్స్‌, బుట్టబొమ్మలు, కేరళ డప్పులు, కోలాటం, తీన్‌మార్‌ డప్పులు, డిజె సౌండ్స్‌ ఏర్పాటు చేశారు. పాలకొల్లు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి భారీ ఎత్తున బాణసంచా కాల్పు లు నిర్వహించారు. దూర ప్రాంతంలో ఉన్న పట్టణ ఆడపడుచులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వలిరెడ్డి వరహాల రావు, శిడగం సురేంద్ర సంతోష్‌ కుమార్‌, చందక సత్తిబాబు, గొలగాని రమేష్‌ బాబు, కొల్లి కొండ ప్రసాద్‌ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షి ంచారు.

Updated Date - 2022-05-24T05:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising