మహనీయుడు డాక్టర్ అంబేడ్కర్
ABN, First Publish Date - 2022-12-07T00:39:08+05:30
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమాలు నగరంలోని పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో మంగళవారం నిర్వహించారు.
టీడీపీ ఏలూరు కన్వీనర్ చంటి
వాడవాడలా వర్ధంతి కార్యక్రమాలు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమాలు నగరంలోని పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో మంగళవారం నిర్వహించారు. అంబేడ్కర్ విశిష్ట లక్షణాలను విద్యార్థులకు వివరించారు. వాడవాడలా విగ్రహాలు, చిత్రపటాల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఏలూరు కార్పొరేషన్/ఏలూరు ఎడ్యుకేషన్/ఏలూరు టూటౌన్, డిసెంబరు 6 : స్థానిక పవరుపేట జనసేన కార్యాలయం వద్ద డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటానికి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు పూలమాల వేసి నివాళుల ర్పించారు. మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి రామకృష్ణప్రసాద్, రిటైర్డ్ తహసీల్దార్ గుబ్బల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సీఆర్‌ఆర్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ రామరాజు, కరస్పాండెంట్ డాక్టర్ విష్ణుమోహన్ మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి భారతీయులకు బహుమానంగా ఇచ్చారని కొనియాడారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇమ్మానియేల్, శంకర్ పాల్గొన్నారు.
మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ అని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య కొనియాడారు. ఏలూరు మూడో డివిజన్‌లో అం బేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు తదతరులు పాల్గొన్నారు. పాతబస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఎన్జీఈవో సంఘం జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు నేతర అజయ్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బుట్టాయగూడెం/పోలవరం/కొయ్యలగూడెం/టి.నరసాపురం: బుట్టాయ గూడెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అంబేడ్కర్ చిత్రపటానికి ఎంపీపీ కారం శాంతి పూలమాల వేసి నివాళులర్పించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఎస్.శాంతకుమారి అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. పోలవరం కాలేజీ రోడ్‌లో వున్న అంబేడ్కర్ విగ్రహానికి టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సొబ్బన మోహన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు. కొయ్యలగూడెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రామా రావు, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ, వైసీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. టి.నరసాపురం మండలం కేతవరంలో సర్పంచ్ తడికలపూడి శివమాధవికిషోర్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చింతలపూడి/జంగారెడ్డిగూడెం/కామవరపుకోట, డిసెంబరు 6 : చింతల పూడి వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలేజా, ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో, ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నగర పంచాయతీ కమిషనర్ నల్లా రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో, గుర్వాయిగూడెం టీడీపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జంగారెడ్డిగూడెం ప్రియదర్శిని కళాశాలలో ప్రింట్ అండ్ ఎలకా్ట్రనిక్ మీడియా ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కామవరపుకోట మండలం కొత్తూరులో పార్టీ మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కరిపోతు కృష్ణ, బీసీ సెల్ అధ్యక్షుడు దొడ్డాకుల గంగాధరరావు, ఐటీడీపీ మం డల కన్వీనర్ మాన్యం దుర్గారావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నివా ళులర్పించారు. కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ మోడల్ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు.
Updated Date - 2022-12-07T00:39:10+05:30 IST