ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహనీయులకు అవమానం

ABN, First Publish Date - 2022-07-18T06:07:52+05:30

మహనీయులకు అవమానం

లంకలకోడేరులో అల్లూరి విగ్రహంపై పూసిన మట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లంకలకోడేరులో సీతారామరాజు విగ్రహానికి మట్టి పూసి.. దుశ్చర్య
చిగురుకోట దళితవాడలో అంబేడ్కర్‌ విగ్రహం వేలు ధ్వంసం

పాలకొల్లు అర్బన్‌, జూలై 17: భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి, సంబరాలు చేసుకుని కొద్దిరోజులైనా అవక ముందే.. పాలకొల్లు మండలంలోని లంకలకోడేరులో అల్లూరిని అవమానించేలా కొందరు గుర్తు తెలియని వ్యకులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గ్రామంలోని జవహర్‌ యువజన సంఘం భవనం ఎదుట ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్ర హానికి శనివారం రాత్రి కొందరు మట్టి పూశారు. ఆదివారం ఉదయం ఘటన వెలుగు చూడటంతో గ్రామంలో కలకలం రేగింది. దురహంకారం, ద్వేషపూరిత కుట్రగా గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పారీలకు అతీతంగా అందరూ దీనిని ఖండించాలని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చింతపర్రు గ్రామ ఉప సర్పంచ్‌ కె.సత్య నారాయణరాజు, పెన్మెత్స సూర్యనారాయణరాజు, ఎం.సూర్యనారాయణరాజు, ఎం.అచ్యుతరాజు, ఎం.శ్రీనివాసరాజు, ఎస్వీ పవన్‌కుమార్‌రాజు డిమాండ్‌ చేశారు.
 


దళిత సంఘాల ఆగ్రహం
ముదినేపల్లి రూరల్‌: మండలంలోని చిగురుకోట దళితవాడలో ఆదివారం అంబేడ్కర్‌ విగ్రహం చేతి వేలును  విరగగొట్టారు. అధికార పార్టీ మండల నాయకుడి అనుచరులు ఇద్దరు, చేపల చెరువుపై పనిచేస్తున్న మరో ఇద్దరు ఇందులో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు అప్పటికప్పుడే వేలు నిర్మాణం చేయడం గమనార్హం. ఘటనపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - 2022-07-18T06:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising