ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతులకు నీరాజనాలు

ABN, First Publish Date - 2022-09-29T06:05:45+05:30

అమ రావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ అమరావతి ప్రాంత రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన మహాపాదయ్రాత ఏలూరు మండలంలో ఏలూరు–వంగాయిగూడెం వద్ద రైతులకు ఘన స్వాగతం లభించింది.

ఏలూరు–వసంతమహల్‌ సెంటర్‌లో అమరావతి రైతుల పాదయాత్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు టూటౌన్‌/ఏలూరు కార్పొరేషన్‌/కొయ్యలగూడెం, సెప్టెంబరు 28 : అమ రావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ అమరావతి ప్రాంత రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన మహాపాదయ్రాత ఏలూరు మండలంలో ఏలూరు–వంగాయిగూడెం వద్ద రైతులకు ఘన స్వాగతం లభించింది. ఏలూరు ఆసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణయ్య ఆధ్వర్యం లో స్వాగతం పలికారు. వంగాయిగూడెం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పావురాలను ఎగురవేసి యాత్ర ప్రారంభించారు. మహాపాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. టోబాకో మర్చంట్‌ కల్యాణ మండపంలో మధ్యాహ్న భోజనాలు ముగించుకుని పాత బస్టాండ్‌, తూర్పులాకుల మీదుగా దెందులూరు నియోజకవర్గం కొవ్వలికి చేరుకున్నారు. టీడీపీ కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్‌, ఉుప్పాల జగదీష్‌బాబు, శశికుమార్‌, చల్లా ప్రసాద్‌, లింగిశెట్టి శశికుమార్‌, దాసరి ఆంజనేయులు, ఎడ్డిబోయిన శివప్రసాద్‌, పూజారి నిరంజన్‌, వేగి ప్రసాద్‌, చోడే వెంకటరత్నం, నెరుసు గంగరాజు, మనోహర్‌, సీపీఎం నాయకులు సోమయ్య, కె.శ్రీనివాస్‌, సీపీఐ రాష్ట్ర నాయకులు డేగా ప్రభాకర్‌, బండి వెంకటేశ్వరరావు, కృష్ణచైతన్య, ఆమ్‌ఆద్మీపార్టీ నాయకులు షేక్‌ మస్తాన్‌ భాష, జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు, తదిలరులు పాల్గొన్నారు. 

 ఏపీలో మూడు రాజధానులు ముప్పేనని జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరు నగరానికి బుధవారం చేరుకున్న నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అమరావతి రైతుల బృందాలతో పాదయాత్రలో పాల్గొన్నారు. జనసేన జిల్లా కార్యదర్శి కస్తూరి తేజశ్విని, సంయుక్త కార్యదర్శి శ్రావణ్‌, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్‌, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్‌, నగర ఉపాధ్యక్షులు బొత్స మధు పాల్గొన్నారు. కొయ్యలగూడెం మండల రైతులు బుధవారం ఏలూరు వెళ్లి పాదయాత్రకు మద్దతు పలికారు. పాదయాత్రలో కొడవటి రామకృష్ణ, నిమ్మగడ్డ రవీంధ్రనాధ్‌, కృష్ణ, రాంబాబు, తదితర రైతులు ఉన్నారు.

Updated Date - 2022-09-29T06:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising