ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

ABN, First Publish Date - 2022-06-29T05:30:00+05:30

అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలు పురస్కరించుకుని బుధవారం విష్ణు కళాశాలలో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం ఎడ్యుకేషన్‌, జూన్‌ 29: అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలు పురస్కరించుకుని బుధవారం విష్ణు కళాశాలలో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. దేశభక్తి భావనలతో నృత్య ప్రదర్శనలు, జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలతో విద్యార్ధులు అలరించారు. ఆర్డీవో దాసి రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు దేశానికి చేసిన నిస్వార్ధసేవ, పోరాట పటిమను భావితరాలకు తెలియజేప్పేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు.


సిద్ధాంతం జడ్పీ హైస్కూల్‌లో..


పెనుగొండ: సిద్ధాంతం జడ్పీ హైస్కూలులో అల్లూరి జయంత్యుత్సవాలు ఘ నంగా నిర్వహించారు. సర్పంచ్‌ చింతపల్లి గనిరాజు అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేశారు.  అనంతరం విద్యార్థులకు వక్తృ త్వం, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో గుత్తుల సత్యవతి, ఏడుకొండలు, ఎంఈవో డి.సుభాకర్‌, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


పెంటపాడు: బ్రిటిష్‌ వారిపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని ఎంపీపీ దాసరి హైమావతి అన్నారు. అల్లూరి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఉన్నత పాఠశాలల స్థాయిలో బుధవారం పెంటపాడు పోస్టుబేసిక్‌లో మన్యం వీరుడికి నివాళులర్పించారు. వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వైసీపీ జిల్లాకార్యదర్శి నల్లమిల్లి విజయానందరెడ్డి, కొవ్వూరి విజయభాస్కరెడ్డి, వైస్‌ ఎంపీపీలు కొణతల వెంకట్రావు, మండా శివ, ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సూరిబాబు హెచ్‌ఎం ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising