ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమవరంలో దేశంలోనే పెద్ద అల్లూరి విగ్రహం

ABN, First Publish Date - 2022-07-06T05:55:30+05:30

భీమవరంలో దేశంలోనే పెద్ద అల్లూరి విగ్రహం

మోగల్లులో..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, జూలై 5: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ప్రధాని ఆవిష్కరించిన 30 అడుగుల కాంస్య విగ్రహం దేశంలోనే అతిపెద్ద అల్లూరి విగ్రహంగా నమోదైంది. అల్లూరి స్వగ్రామం మోగల్లులో 1965లో ప్రతిష్టించిన విగ్రహం దేశంలో తొలి అల్లూరి విగ్రహంగా నమోదైంది. భీమవరంలో 30 అడుగుల విగ్రహాం తయారీకి రూ.3 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ విగ్రహం ఏర్పాటుకు, పార్కు స్థలాన్ని మున్సిపాలిటీ ఉచితంగా ఇచ్చింది. స్థల బదలాయింపులో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సహకారం అందించారు. ప్రత్యేక అధికారి, కలెక్టర్‌ పి.ప్రశాంతి దీనికి ఆమోదముద్ర వేశారు. స్థలం విలువ మార్కెట్‌ ధర ప్రకారం సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. ప్రధాని ఆవిష్కరించడంతో విగ్రహాన్ని చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భీమవరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మోగల్లులో మంచినీటి చెరువు గట్టున 1965లో అప్పటి విశాఖ ఎంపీగా ఉన్న అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరుడు మల్లు దొర అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీతారామరాజుకు సన్నిహితంగా ఉన్న ఆయన ముఖ కవళికలను, శరీర ఆహార్యాన్ని కచ్చితంగా అంచనా వేయించి ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. దీంతో భీమవరం ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఈ రెండు విగ్రహాలను వీక్షించడానికి అవకాశాలున్నాయి.





Updated Date - 2022-07-06T05:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising