భూసారాన్ని బట్టి ఎరువులు వేయాలి
ABN, First Publish Date - 2022-08-05T05:12:09+05:30
సార్వా సాగులో భూసారాన్ని బట్టి ఎరువులు వేయాలని ఏవో నిమ్మల శ్రీనివాసరావు రైతులకు సూచించారు.
భీమవరం రూరల్, ఆగస్టు 4: సార్వా సాగులో భూసారాన్ని బట్టి ఎరువులు వేయాలని ఏవో నిమ్మల శ్రీనివాసరావు రైతులకు సూచించారు. శుక్రవారం యనమదుర్రులో గురువారం పొలం బడి నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఎరువులు అధికంగా వేయడం వలన తెగుళ్లు సంక్రమిస్తాయని సూచించారు. సాగుపై పలు సూచనలు ఇచ్చారు. పురుగు మందుల వాడకంలో రైతులు జాగ్రత్తలు వహించాలని లేకపోతే రైతుకే ప్రమాదం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.
అనవసరంగా పురుగు మందులు పిచికారీ చేయొద్దు
తణుకు, ఆగస్టు 4: అనవసరంగా ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయొద్దని ఏవో కె.కుసుమ సూచించారు. గురువారం కోనాలలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. వరినాట్లు వేసిన 30 రోజుల్లోపు వరికి పునరు త్పత్తి శక్తి ఉంటుందన్నారు. రైతులకు పొలంలో అనవసర పిలకల తొలగిం పును క్షేత్రస్థాయిలో చేయించారు. పురుగు మందుల విషప్రభావం మానవాళిపై పడుతుందన్నారు. అవసరం లేకుండా మందులు పిచికారీ చేయవద్దని సూచించారు. ఏఈవోలు టి.వీరభద్రుడు, కె.శిరీష పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T05:12:09+05:30 IST