చేపల వేటకని వెళ్లి..
ABN, First Publish Date - 2022-03-05T06:29:25+05:30
చేపల వేటకు వెళ్లి ఊబిలో కూరుకుపోయిన ఇద్దరు గిరిజన మహిళలు మృత్యువాత పడ్డారు.
ఇద్దరు గిరిజన మహిళలు మృతి
పోలవరం, మార్చి 4 : చేపల వేటకు వెళ్లి ఊబిలో కూరుకుపోయిన ఇద్దరు గిరిజన మహిళలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పోలవరం మండలం రేపల్లివాడలో శుక్రవారం జరిగింది. పోలవరం ఏఎస్‌ఐ వై.శ్రీనివాసరావు తెలిపిన వివ రాలివి.. మామిడిగొంది గ్రామానికి చెందిన కలుం నాగమణి(35), తెల్లం రాములమ్మ (25) మధ్యాహ్నం చేపలవేటకని రేపల్లెవాడ సమీపంలోని పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వపై నిర్మించిన గుంజవరం నాగంపాలెం డైవర్షన్ కాల్వ వద ్దకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో నాగమణి నీటిలో పడిపోవడంతో రాములమ్మ చేయందించడానికి ప్రయత్నించి తాను పడిపోయింది.ఊబి ప్రాంతం కావడంతో పైకి రాలేక ఊపిరాడక మృతి చెందారు. మృతదేహాల్ని పోస్టుమా ర్టం నిమిత్తం పోలవరం తరలించి కేసు నమోదు చేస్తామని ఏఎస్‌ఐ వై.శ్రీనివాసరావు తెలిపారు.
Updated Date - 2022-03-05T06:29:25+05:30 IST