ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి విడతగా 5 వేల టిడ్కో ఫ్లాట్లు

ABN, First Publish Date - 2022-01-26T07:32:28+05:30

ఏపీ టిడ్కో జిల్లాలో నిర్మించిన 20 వేల ఫ్లాట్లలో తొలి విడతగా 5 వేల ఫ్లాట్లను ఈ నెల చివరి వారం నుంచి లబ్ధిదారులకు అందజేస్తామని ఏపీ టిడ్కో ఎండీ చిట్టూరి శ్రీధర్‌, మెప్మా ఎండీ వి. విజయలక్ష్మి తెలిపారు.

భీమవరంలో అధికారులతో సమీక్షిస్తున్న టిడ్కో ఎండీ శ్రీధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం/పాలకొల్లు టౌన్‌, జనవరి 25 : ఏపీ టిడ్కో జిల్లాలో నిర్మించిన 20 వేల ఫ్లాట్లలో తొలి విడతగా 5 వేల  ఫ్లాట్లను ఈ నెల చివరి వారం నుంచి లబ్ధిదారులకు అందజేస్తామని ఏపీ టిడ్కో ఎండీ చిట్టూరి శ్రీధర్‌, మెప్మా ఎండీ వి. విజయలక్ష్మి తెలిపారు. అలాగే సౌకర్యాల కల్పనకు టిడ్కో కాలనీల అభివృద్ధికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. భీమవరం పట్టణ శివారులో నిర్మించిన ఏపీ టిడ్కో కాలనీలో మంగళవారం అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు తేదీలు నిర్ణయించుకుని ప్రారంభిస్తారన్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో 20 వేల ఫ్లాట్‌లతో కూడిన అపార్ట్‌మెంట్లు నిర్మించిన విషయాన్ని వారు ప్రస్తావించారు. ప్రస్తుతం ఉచిత ఇళ్లతో పాటు 365, 430 చదరపు అడు గుల ఫ్లాట్లు అందజేస్తున్నామన్నారు. పాలకొల్లు శివారు పెంకుళ్లపాడులో నిర్మి స్తున్న టిడ్కో జి+3 గృహ సముదాయాన్ని వారు పరిశీలించారు. మార్చిలో లబ్ధిదారులకు ఇళ్లు అందజేసేందుకు  చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T07:32:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising