ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగో రోజు.. కత్తి దూసిన కోళ్లు

ABN, First Publish Date - 2022-01-18T05:42:47+05:30

సంక్రాంతి అంటే ఆ సరదాయే వేరు. పల్లెల్లో జోరుగా కోడి పందేలు, డైమండ్‌ డబ్బా, పేకాట వంటి వాటికి పెట్టింది పేరు. గతంలో మండలానికో ప్రాంతంలో వీటిని నిర్వహించేవారు.

చాటపర్రులో కోడి పందేలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాటపర్రులో జోరుగా పందేలు 

 పట్టించుకోని పోలీసులు 

ఏలూరు రూరల్‌/దెందులూరు, జనవరి 17 : సంక్రాంతి అంటే ఆ సరదాయే వేరు. పల్లెల్లో జోరుగా కోడి పందేలు, డైమండ్‌ డబ్బా, పేకాట వంటి వాటికి పెట్టింది పేరు. గతంలో మండలానికో ప్రాంతంలో వీటిని నిర్వహించేవారు. ఈ ఏడాది గ్రామంలో సైతం బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. ఏలూరు రూరల్‌ మండలంలోని చాలా గ్రామాల్లో జూదం యథేచ్ఛగా జరిగింది. చాటపర్రు గ్రామంలో సంక్రాంతి నాలుగోరోజు సోమవారం కోడి పందేలు జోరుగా సాగాయి. అధిక సంఖ్యలో పందెం రాయుళ్లు పాల్గొన్నారు. మూడు రోజులుగా పందేలు జోరుగా జరిగినా నాలుగో రోజు గుట్టుచప్పుడు కాకుండా నిర్వాహకులు పందేలు నిర్వహించి జేబులు నింపుకున్నారు. ఎట్టకేలకు సోమ వారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం తెలిసినా చాటపర్రు పందెం బరికి వచ్చి పందెం రాయుళ్లను బెదరగొట్టారు. మధ్యాహ్నం నుంచి మళ్లీ అధికార పార్టీ నాయకుల అండదండలతో కోడిపందెం నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-01-18T05:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising