ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Floods: తగ్గిన వశిష్ఠ గోదావరి ఉధృతి

ABN, First Publish Date - 2022-07-24T01:24:39+05:30

పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో వశిష్ఠ గోదావరి ఉధృతి శనివారం నాటికి మరింత తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో వశిష్ఠ గోదావరి ఉధృతి శనివారం నాటికి మరింత తగ్గింది. లంక గ్రామాలు ముంపు నీటి నుంచి బయటపడ్డాయి. నరసాపురం పట్టణం (Narasapuram Town)లోని గోదావరి బండ్‌పై అంక్షలు ఎత్తివేశారు. అయితే కోతకు గురైన పొన్నపల్లి ప్రాంతం నుంచి వాహనాలను అనుమతించలేదు. మాధవాయిపాలెం రేవులో మాత్రం పంటు రాక పోకలు పునరుద్ధరణ కాలేదు. మరోవైపు వరద తగ్గడంతో అన్ని రేవులు మట్టి, ఇసుకతో బురద మయంగా మారాయి. ఆచంట మండలం పెదమల్లంలోని మాచేనమ్మ ఆలయ ప్రాంగణంలో పూర్తిగా బురద పేరుకుపోయింది. అయోధ్యలంకలో సిమెంటు రోడ్లపై నిండిపోయిన బురదను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. వరద నుంచి బయటపడ్డ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను వేగంగా చేపడుతున్నారు. ఇళ్లల్లో తడిచిపోయిన వస్తువులు, రోడ్ల మీద పడవేయడంతోపాటు వరదలకు కొట్టుకొచ్చిన చెత్త చెదారాలను పారిశుధ్య సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అంటువ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ (Bleaching powder)ను చల్లిస్తున్నారు.

Updated Date - 2022-07-24T01:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising