ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

floods: జల దిగ్బంధంలోనే లంక గ్రామాలు

ABN, First Publish Date - 2022-07-19T00:53:12+05:30

పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో ఐదో రోజు లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ధవళేశ్వరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో ఐదో రోజు లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ధవళేశ్వరం (Dhavaleswaram) వద్ద వరద ఉధృతి తగ్గినా.. సముద్రంలోకి నీటిని విడిచి పెట్టడంతో ఆ ప్రభావం వశిష్ఠ గోదావరిపై పడింది. ఈ కారణంగా యలమంచిలి మండలంలో తొమ్మిది, ఆచంట మండలంలో ఐదు, నరసాపురం మండలంలో రెండు, నరసాపురం పట్టణం (Narasapuram Town)లోని మూడు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పడవలపైనే రాకపోకలు సాగుతున్నాయి. రెండు రోజులతో పోలిస్తే రెండడుగుల మేర నీటి మట్టాలు తగ్గాయి. ఇటు నరసాపురం వద్ద ఇంకా ప్రమాదకర పరిస్థితే కొనసాగుతోంది. ఆదివారం రాత్రి పొన్నపల్లి వద్ద గోదావరి (Godavari) గట్టుపై వున్న 15 మీటర్ల మేర రైలింగ్‌ కొట్టుకుపోయింది. ఇక్కడ గండి పడుతుందన్న భయంతో ప్రజలు తెల్లవార్లూ జాగారం చేశారు. ఏ క్షణంలోనైనా ముంపు వాట్లిలే ప్రమాదం ఉండటంతో పొన్నపల్లి వాసులను తరలించేందుకు అధికారులు బస్సులను రఢీ చేసి ఉంచారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF), ఓఎన్‌జీసీల సహకారంతో ఇరిగేషన్‌ అధికారులు రైలింగ్‌ కొట్టుకుపోయిన చోట క్రాస్‌ బండ్‌ వేస్తున్నారు. ఇటు ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద ఐదు రోజుల క్రితం పడిన గండిని ఇంకా పూడ్చలేదు. 

Updated Date - 2022-07-19T00:53:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising