ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Weather report: ఆగస్టు, సెప్టెంబరులో సాధారణ వర్షాలే

ABN, First Publish Date - 2022-08-02T01:13:48+05:30

నైరుతి రుతుపవనాల సీజన్‌లో కీలకమైన ఆగస్టు, సెప్టెంబరు (August September) నెలల్లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదుకానున్నది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల సీజన్‌లో కీలకమైన ఆగస్టు, సెప్టెంబరు (August September) నెలల్లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదుకానున్నది. వాయువ్య, దక్షిణ, మధ్య భారతంలో ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం, అంత కంటే ఎక్కువగా, తూర్పు, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదుకానున్నది. ఈమేరకు సోమవారం భారత వాతావరణ శాఖ రెండు నెలలకు సంబంధించి బులెటిన్‌ (Bulletin) విడుదల చేసింది. 1971 నుంచి 2020 వరకు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో  కురిసిన సగటు (96-104 శాతం) వర్షపాతాన్ని పరిగణనలో తీసుకుని ఈ ఏడాది 422.8 మి.మీ.ల వర్షపాతం కురుస్తుందని అంచనా వేసింది.


ఆగస్టు నెల వరకు దీర్ఘకాల సగటును (96- 104 శాతం) పరిగణనలోకి తీసుకుని 254.9 మి.మీ.ల వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. ఆగస్టులో ఏపీ (ఉత్తరకోస్తా తప్ప), తెలంగాణ, తమిళనాడు (Telangana, Tamil Nadu), కర్నాటకలోని తూర్పుప్రాంతం, రాజస్థాన్‌ నుంచి కశ్మీర్‌ వరకు ఉన్న ప్రాంతాలు, యూపీలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. మధ్యభారతంలో మహారాష్ట్ర నుంచి ఛత్తీస్‌గఢ్‌ వరకు, కర్నాటకలో పడమర ప్రాంతం, కేరళ, తూర్పు, ఈశాన్యభారతంలో లోటు వర్షపాతం నమోదుకానున్నదని తాజా బులెటిన్‌ వెల్లడించింది. కాగా పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం ఉన్న లానినా పరిస్థితులు ఈ ఏడాది చివరకు కొనసాగుతాయి. అయితే హిందూ మహాసముద్రంలో తటస్థంగా ఉన్న ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ రానున్న రెండు నెలల్లో నెగెటివ్‌ దిశగా వెళ్లనున్నదని, ఇది కొంత వరకు రుతుపవనాల కాలంలో వర్షాలు తగ్గడానికి దోహదం చేస్తుందని నిపుణులు అంచనావేశారు.

Updated Date - 2022-08-02T01:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising