సాగునీటి కాంపోనెంట్‌కే నిధులిస్తాం
ABN, First Publish Date - 2022-12-16T01:50:18+05:30
పోలవరం ప్రాజెక్టులో కేవలం సాగునీటి కాంపోనెంట్‌కు అయ్యే వ్యయాన్ని భరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టంచేశారు.
పోలవరంపై స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కేవలం సాగునీటి కాంపోనెంట్‌కు అయ్యే వ్యయాన్ని భరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టంచేశారు. దానికి సంబంధించి 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ ఆఫీస్ మెమోరాండం జారీ చేసిందని గుర్తు చేశారు. గురువారం లోక్‌సభలో వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన-సత్వర సాగు ప్రయోజనాల కార్యక్రమానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. జాతీయ ప్రాజెక్టుల పథకంలో తాగునీటి కంపోనెంట్‌లను చేర్చవచ్చని, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పనులకు నిధులు ఇవ్వలేమని తెలిపారు.
Updated Date - 2022-12-16T01:50:19+05:30 IST