ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చి నుంచి క్రాప్‌ హాలిడే ప్రకటిస్తాం

ABN, First Publish Date - 2022-12-13T03:25:56+05:30

సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని.. వచ్చే ఏడాది మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్రాప్‌ హాలిడే ప్రకటిస్తామని ఆక్వా రైతులు హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రస్థాయి సదస్సులో ఆక్వా రైతుల హెచ్చరిక

కాకినాడ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని.. వచ్చే ఏడాది మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్రాప్‌ హాలిడే ప్రకటిస్తామని ఆక్వా రైతులు హెచ్చరించారు. ఆక్వా రైతుల రాష్ట్రస్థాయి సదస్సు సోమవారం కాకినాడలో జరిగింది. పలు జిల్లాల నుంచి సదస్సుకు వచ్చిన ఆక్వా రైతులు ప్రస్తుత సంక్షోభానికి కారణాలు, జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. రాష్ట్రప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీల కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. మేత విక్రయించే కంపెనీలే రొయ్యలు కొనాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా మేతతోపాటు నాణ్యమైన సర్టిఫైడ్‌ సీడ్‌ను విక్రయించాలని డిమాండ్‌ చేశారు. రొయ్యలకు రాష్ట్రంలో ధర లేక పశ్చిమబెంగాల్‌ వెళ్లి విక్రయించుకోవాల్సి వస్తోందని దొరబాబు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు క్రాప్‌హాలిడే ప్రకటిస్తే గానీ ప్రభుత్వం స్పందించదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వారైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఏపీ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం చెప్పారు.

Updated Date - 2022-12-13T03:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising