ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెలికాప్టర్‌ కావాలా!

ABN, First Publish Date - 2022-07-01T08:09:15+05:30

హెలికాప్టర్‌ కావాలా!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందరికీ అందుబాటులో హెలీ సేవలు

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే..

జిల్లాల్లో ప్రమోషన్‌కు ఆదేశాలు.. 48 గంటల్లో అనుమతి

హెలికాప్టర్లు కావాల్సినవారు ఈ-సేవలు పొందొచ్చు


(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

జిల్లాల్లో పర్యాటకాన్ని పెంపొందించటానికి, హెలికాప్టర్‌ ప్రయాణాలను పెంచటానికి వీలుగా చౌకగా హెలికాప్టర్‌ సేవలను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా డిజిటల్‌ ప్లాట్‌ఫాంపైకి ‘హెలీ సేవ’ను తీసుకొచ్చింది. పర్యాటకాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాకుండా, హెలికాప్టర్‌ ప్రయాణాలను పెంచేందుకు కూడా ఈ సేవలను తెరపైకి తెస్తున్నారు. జాతరలు, పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా, విహార యాత్రలు, అత్యవసర ప్రయాణాలు, సమూహంగా వెళ్లేవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే, హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌ (హెచ్‌ఈఎంఎస్‌) సేవలనూ పొందవచ్చు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లోనూ ఈ హెలీ సేవలను ఉపయోగించవచ్చు. 


48 గంటల్లోనే అనుమతి

హెలికాప్టర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 48 గంటల్లోనే అన్ని రకాల అనుమతులు వస్తాయి. ప్రైవేటుగా అయితే, అనుమతులు రావడం కష్టం. కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కాబట్టి త్వరగానే అనుమతులు వస్తాయి. ఈ హెలీ సేవల కింద ప్రభుత్వ సంస్థ అయిన పవన్‌ హాన్స్‌తో పాటు అనేక ప్రైవేట్‌ హెలీ ఆపరేటర్లు కూడా ఉంటారు.


ఎలా బుక్‌ చేసుకోవాలి? 

కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో డిజిటల్‌ ప్లాట్‌ఫాం వేదికగా నడుస్తున్న  https://helisewa. civilaviation.gov.in/  పోర్టల్‌లోకి వెళ్లాలి. ఈ పోర్టల్‌లో ప్రధానంగా నాలుగు రకాల లాగిన్లు ఉంటాయి. ఎయిర్‌ ఆపరేటర్ల లాగిన్‌, గవర్నమెంట్‌ లాగిన్‌, హెలికాప్టర్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌, హెలిప్యాడ్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీ్‌సలు. హెలికాప్టర్‌ సేవలు కావాల్సినవారు హెలికాప్టర్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసులోకి వెళ్లి మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ ఇచ్చి సబ్మిట్‌ చేయాలి. మెయిల్‌ ఐడీకి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయగానే హెలికాప్టర్‌ బుకింగ్‌ కన్ఫర్మ్‌ అవుతుంది.

Updated Date - 2022-07-01T08:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising