ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల తరువాత వాకపల్లి కేసు విచారణ పునఃప్రారంభం

ABN, First Publish Date - 2022-03-22T01:16:05+05:30

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాకపల్లి కేసు రెండేళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు విచారణకు వచ్చింది. కూంబింగ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాకపల్లి కేసు రెండేళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు విచారణకు వచ్చింది. కూంబింగ్‌కు వచ్చిన స్పెషల్‌ పార్టీ పోలీసులు తమపై అత్యాచారం చేశారంటూ విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం వాకపల్లికి 11 మంది గిరిజన మహిళలు పదిహేనేళ్ల క్రితం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రత్యేక కోర్టు ద్వారా ఈ కేసు విచారణ చేపట్టారు. ఇప్పటివరకు 36 మంది సాక్షులను విచారించారు. కరోనా కారణంగా రెండేళ్లు విచారణ నిలిచిపోయింది. విశాఖపట్నంలోని పదకొండవ సెషన్స్‌ జడ్జి/ఎస్సీ, ఎస్టీ బాధితుల ప్రత్యేక కోర్టులో సోమవారం ఈ కేసు విచారణ తిరిగి మొదలైంది. నాడు స్పెషల్‌ పార్టీకి ఆఫీసర్‌గా పనిచేసిన శ్రీకాంత్‌ చిరువోలును విచారించారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ ఈ కేసును వాదిస్తున్నారు. కేసును ఏప్రిల్‌ 12వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - 2022-03-22T01:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising