ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యో.. అవ్వా!

ABN, First Publish Date - 2022-06-24T08:49:14+05:30

ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు కె.చెంగమ్మ. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం కాంబాకం పంచాయతీకి చెందిన నిరుపేద దళితురాలు. ఈమెకు 2.94 ఎకరాల భూమి ఉంది. దానిని ఇటీవల కొందరు ఆక్రమించి ఆన్‌లైన్‌లో పేర్లు మార్చుకుని, పట్టాదారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంకు అర్జీ ఇచ్చేందుకు ఎండలో 4 గంటల నిరీక్షణ

కనికరం చూపని అధికారులు... కంటతడితో ఇంటికి 


శ్రీకాళహస్తి, జూన్‌ 23: ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు కె.చెంగమ్మ. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం కాంబాకం పంచాయతీకి చెందిన నిరుపేద దళితురాలు. ఈమెకు 2.94 ఎకరాల భూమి ఉంది. దానిని ఇటీవల కొందరు ఆక్రమించి ఆన్‌లైన్‌లో పేర్లు మార్చుకుని, పట్టాదారు పాసుబుక్‌ కూడా తీసుకున్నారు. దీనిపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా పరిష్కారం దొరక్కపోవడంతో నేరుగా ముఖ్యమంత్రిని కలిసి అర్జీ ఇవ్వాలనుకుంది. గురువారం సీఎం వస్తున్న విషయం తెలుసుకుని ఇనగలూరు వచ్చింది. సీఎంను కలిసేందుకు అనుమతించాలని అధికారులను వేడుకున్నా కనికరం చూపలేదు. వయసు మీదపడినా...  గూనితో ఎలాగోలా కష్టపడి నడిచి హెలిపాడ్‌ ప్రదేశానికి చేరుకుంది. ఉదయం 10 గంటల నుంచి సీఎం తిరిగివెళ్లేవరకు 4 గంటలకుపైగా ఎండలో రాళ్లనేలపైనే కూర్చుంది. చివరకు అర్జీ ఇవ్వలేక బాధపడుతూ కంటతడితో ఇంటిబాట పట్టింది. 

Updated Date - 2022-06-24T08:49:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising